Thursday, January 23, 2025

వేతనాలు పెంచే వరకు సమ్మె కొనసాగిస్తాం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మెట్రో కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ డిమాండ్లను నేరవేర్చాలని రెండో రోజు సమ్మె చేపట్టారు. టికెటింగ్ సిబ్బంది విధులు బహిష్కరించి బుధవారం ఉప్పల్ డిపో ముందు ఆందోళన చేపట్టారు. విధుల్లో చేరకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామంటూ ఏజెన్సీ ప్రతినిధులు నోటీసులు ఇచ్చి భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మొదటి రోజు యాజమాన్యం చర్చలు జరిపి ప్రస్తుత జీతానికి రూ. 800 మాత్రమే పెంచుతామని, విధులకు హాజరు కాకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించింది. అయితే జీతం స్వల్పంగా పెంచుతామనడంపై ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు.

యథావిధిగా సమ్మె కొనసాగిస్తామని టికెటింగ్ సిబ్బంది తేల్చిచెప్పారు. మూడు కారిడార్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నట్లు తెలిపారు. ఐదేళ్లుగా పనిచేస్తున్నప్పటికి వేతనం ఏమాత్రం పెంచకుండా తక్కువ వేతనంతో ఎక్కువ పనిగంటలు చేయిస్తూ తమ శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. స్టేషనకు 20మంది చొప్పున మొత్తం 1000 మంది వరకు ఉంటారని, వారి జీవితాల్లో ఏజెన్సీ నిర్వహకులు ఆటలాడుతున్నారని, మొదటి రోజు సమ్మె చేసిన చర్చలు జరిపినట్లు ఉద్యోగులు విధుల్లో చేరుతున్నారని ప్రచారం చేసి తప్పుదారి పట్టించారని మండిపడ్డారు. తమకు ప్రయాణికులను ఇబ్బంది పెట్టే ఉద్దేశ్యం లేదని, రోజుకు 15 గంటల పాటు పని చేయించుకుంటూ సరిగా వేతనాలు చెల్లించడం లేదని, భోజన విరామ సమయం కూడా ఇవ్వడంలేదన్నారు.

ఉద్యోగాలు పోయిన పర్వాలేదు, ఇన్నేళ్లు ఉద్యోగం చేసిన తమకు లాభం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అందుకే కార్మిక సంఘం హక్కులు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హక్కులు అమలు చేసిన తరువాతే ఉద్యోగంలో చేరుతామని తెలిపారు. ఉద్యోగంలో చేరాలంటూ యాజమాన్యం చెబుతోంది. కానీ వాళ్లు చెప్పినట్లు పాటించాలని సూచిస్తున్నారు. జీతాలు పెంచేవరకు సమ్మెలో ఉంటామని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News