Monday, January 20, 2025

మెట్రో ఫేజ్2లో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో సేవలు

- Advertisement -
- Advertisement -

రూ.5వేల కోట్లతో నిర్మాణానికి మెట్రో ప్రణాళికలు సిద్దం
అదనపు పెట్టుబడి కోసం ఈప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు….
ఎవరైనా ముందుకు రావొచ్చు ః మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి
పరేడ్‌గ్రౌండ్ మెట్రోస్టేషన్ వద్ద ఎలక్ట్రికల్ ఆటోలు ప్రారంభం

Metro services to Shamshabad Airport in Metro Phase 2
మన తెలంగాణ,సిటీబ్యూరో: మహానగరానికి మణిహారంగా నిలిచిన మెట్రో తన సేవలు మరింత విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుంది. అందులో భాగంగా మెట్రో ఫేజ్ 2 నిర్మాణం దృష్టి పెట్టామని, శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు మెట్రో సేవలు విస్తరిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి పేర్కొన్నారు. రూ. 5వేల కోట్లతో నిర్మాణానికి ప్రణాళికల రూపొందించినట్లు తెలిపారు. అదనపు పెట్టుబడికి తాము సిద్దంగా ఉన్నామని, ఈప్రాజెక్టులో భాగస్వామలయ్యేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని కోరారు. గురువారం నగరంలో మెట్రో ప్రయాణికుల కోసం మెట్రోరైడ్ పేరుతో ఎలక్ట్రిక్ ఆటో సర్వీసులు పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వద్ద ప్రారంభించారు.

అనంతరం మాట్లాడుతూ మెట్రో స్టేషన్ నుంచి గమ్యస్దానానికి చేరేలా ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులో తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రైవేటు ఆటోల కంటే మెట్రో ఆటోల్లో చార్జీలు చాలా తక్కువన్నారు.కరోనా కారణంగా మెట్రో రూ. 3వేల కోట్ల నష్టాలు వచ్చినట్లు తెలిపారు. వైరస్ కంటే ముందు రోజు ప్రయాణికుల సంఖ్య 4లక్షలు ఉండేది. ప్రస్తుతం రోజుకు 2.70లక్షల మంది మెట్రోలో వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. తొలి,తుది మైలు కనిక్టివిటి మెరుగుపరచడం మాకు అత్యంత ముఖ్యమైన లక్షం. ఈవిద్యుత్ ఆటో సేవలు సానుకూల సామాజిక ఆర్దిక ప్రభావాన్ని ప్రతి ఒకరిపై చూపుతాయని మేము నమ్మడమే కాదు, మెట్రో వినియోగదారులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించగలదని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

అనంతరం మెట్రోరైల్ ఎండీ, సీఈవో కెవీబీరెడ్డి వివరిస్తూ భాగస్వామిగా మెట్రో రైడ్‌తో భాగస్వామం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈబాగస్వామ్యంంతో హైదరాబాద్ మెట్రోరైల్ కోసం తొలి, తుది కనెక్టివిటి మెరుగుపడుతుంది. ఇది ఎలాంటి నగర రవాణా మార్గానికైనా అత్యంత కీలకమన్నారు. మెట్రోరైడ్ విద్యుత్ ఆటో సేవలతో కూడీ ఏఐ ఆధారిత గ్రీన్ ప్లిట్‌తో ఇప్పుడు మెట్రో ప్రయాణికులు పరేడ్ గ్రౌండ్, రాయదుర్గం మెట్రో స్టేషన్ల నుంచి సౌకర్యవంతంగా ఆధారపడతగిన రీతిలో ప్రయాణించవచ్చు. అంతేగాకుండా నగర ప్రయాణిలకు సౌకర్యం. గ్రీన్‌పుట్ ప్రింట్ జోడించవచ్చు. త్వరలోనే ఈసేవలను ఇతర మెట్రో స్టేషన్ల వద్ద కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఈకార్యక్రమంలో మెట్రోరైడ్‌కోఫౌండర్ గిరీష్‌నాగ్‌పాల్, కోఫౌండర్, సిటిఓ కమన్ అగర్వాల్, క్లీన్ మొబిలిటీ అండ్ ఎనర్జీ టెక్ డైరెక్టర్ పవన్ ములుకుట్ల పాల్గొన్ని ప్రసంగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News