Monday, December 23, 2024

ఎయిర్‌పోర్టు మెట్రోకు ఆలైన్‌మెంట్ ఖరారు

- Advertisement -
- Advertisement -

గ్రౌండ్ డేటా సేకరణకు రెండు సర్వే బృందాలు
మెట్రో స్టేషన్ల నిర్మాణం ప్రధాన రహదారి జంక్షన్ల వద్ద
శివారు ప్రాంతాలు అభివృద్ది చెందేలా కారిడార్ నిర్మాణం: ఎన్వీఎస్‌రెడ్డి

మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో ఎయిర్‌పోర్టు మెట్రో నిర్మాణ పనులు వేగవంతమయ్యేలా ఆలైన్‌మెంట్ ఖరారు, గ్రౌండ్ డేటా సేకరణ తదితర పనులు త్వరితం చేసేందుకు రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. మెట్రో పిల్లర్లు, వయాడక్ట్, మెట్రోస్టేషన్ల నిర్మాణం, వాటి ఎత్తు ఎంత ఉండాలనే విషయంలో ఈడేటా కీలకమౌతుందన్నారు. ఆదివారం సర్వే పనులు ప్రారంభించిన ఆయన హెఎయంఎల్ సీనియర్ ఇంజనీర్ల బృందంతో కలిసి రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి నార్సింగ్ జంక్షన్ వరకు ఎయిర్‌పోర్టు మార్గాన్ని పరిశీలించారు. దాదాపు 10కిమీ పొడువున ఉన్న ఈమార్గంలో కాలినడక నడుస్తూ ఇంజనీర్లకు సర్వే బృందాలకు ఎండి తగిన ఆదేశాలు ఇచ్చారు.

1. మెట్రో స్టేషన్లలో నిర్మాణం ప్రధాన రహదారి జంక్షన్లకు దగ్గరగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశించిన విధంగా ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ను నగర విస్తరణ ప్రణాళికలో భాగంగా నగర శివారు ప్రాంతాల అభివృద్దికి ఉపయోగ పడేలా తయారు చేయాలని సూచించారు. ఈకారిడార్ కేవలం విమానాశ్రయ ప్రయాణీకులకు మాత్రమే కాకుండా ఈప్రాంతంలో ఉండే వారందరికి ముఖ్యంగా నగర శివార్లులో నివాసముండే తక్కువ ఆదాయ వర్గాల వారందరికి కూడా ఉపయోగపడేలా ఉండాలని సూచించినట్లు చెప్పారు. ఇక్కడ నుండి ప్రయాణీకులు తాము పనిచేసే ప్రాంతాలకు కేవలం 20 నిమిషాల వ్యవధిలో చేరుకునేలా ఈకారిడార్ డిజైన్ చేయాలన్నారు.

TS govt imposed Sanctions in Shamshabad Airport

2. ఈప్రాంతం ఇప్పటికే ఆకాశహర్మాలతో నిండి ఉంది. భవిష్యత్తులో ఈప్రాంత అభివృద్ది ఊహించలేనతంగా పెరుగుతుందని అంటూ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ నిర్మించే మెట్రోస్టేషన్లు, అవసరమైన స్కైవాక్‌ల నిర్మాణాలకు సంబంధించి సూచించాలని సర్వే బృందాన్ని ఆదేశించారు. మెట్రోస్టేషన్లకు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి ప్రయాణికుల వాహనాల పార్కింగ్ ఏరియా కోసం సూచించాలన్నారు.

3.రాయదుర్గం స్టేషన్ నుండి సుమారు 900 మీటర్ల మేరకు ఎయిర్‌పోర్టు మెట్రో కోస రాయదుర్గం స్టేషన్ పొడిగిస్తున్నప్పుడు పొడిగించిన బ్లూ లైన్ కొత్త టెర్మినల్ స్టేషన్, ఎయిర్‌పోర్టు మెట్రోస్టేషనలను అనుసంధానంకు సంబంధించిన అవకాశాలను అన్వేషిస్తున్నారు. ఈప్రదేశంలో స్దలాభావం ఉన్నందున్న ఐకెఈఏ భవనం తరువాత ఎల్‌అండ్‌టి అరబిందో భవనాల ముందు ఈరెండు కొత్త స్టేషన్‌లు ఒకదానిపై ఒకటి నిర్మించే అవకాశాన్ని పరిశీలించారు.

4. మొదటి అంతస్తుల్లో ఎయిర్‌పోర్టు కొత్త రాయదుర్గం స్టేషన్, పొడిగించబడిన కొత్త బ్లూలైన్ స్టేషన్ ఎగువ రెండు అంతస్తుల్లో ఉండేలా డిజైన్ చేయాలన్నారు. మెట్రో కారిడార్‌లో నిర్మించిన జెబిఎస్ స్టేషన్, అలాగే అమీర్‌పేట ఇంటర్‌చేంజ్ స్టేషన్‌ల మాదిరిగా నాలుగు అంతస్తుల్లో ఈస్టేషన్ల నిర్మాణం ఉండబోతుందని చెప్పారు.

5. ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు మెట్రో మొదటి స్టేషన్‌కి ప్రవేశ, నిష్క్రమణలు ప్లాన్ చేసేముందు ఇక్కడకు దగ్గర్లోనే ట్రాన్పో సంస్ద ఇటీవల వేసిన 400 కెవి అదనపు హై వోల్టెజ్ భూగర్భ విద్యుత్ కేబుళ్లను మార్చే అవసరం లేకుండా విధంగా ఉండాలని సూచించారు. ఈ హైవోల్టెజ్ విద్యుత్ కేబుళ్లు మార్చడం చాలా సమయం తీసుకుంటుంది. ఆ మార్పు అవసరం లేకుండా డిజైన్ చేయాలని ఇంజనీర్లకు సూచించారు.

6. బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద ఉన్న ప్లైఓవర్ మీదుగా ఎయిర్‌పోర్టు మెట్రో వయాడక్ట్ క్రాసింగ్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. ఇక్కడ కొత్తగా వేసిన అదనపు హై వోల్టెజ్ అండర్‌గ్రౌండ్ కేబుళ్లును మార్చవలసిన అవసరం లేకుండా చేయాలి. అలాగే మెట్రో మొదటి దశలో సైబర్ జంక్షన్ ప్లైఓవర్ దగ్గర చేసినట్లు ప్లైఓవర్ ర్యాంప్ పక్కనే మెట్రో పిల్లర్లు ఉండాలి. బయోడైవర్సిటీ ప్లైఓవర్‌కు అనుకుని మెట్రో పిల్లర్ల నిర్మాణం తరువాత ట్రాఫిక్‌కు ఏమాత్రం అంతరాయం రాకుండా చూడాలన్నారు.

7. బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద మెట్రో స్టేషన్‌ను ప్లాన్ చేసేటప్పుడు ఇదే మార్గంలోనే సమీప భవిష్యత్తులో నిర్మించనున్న బీహెచ్‌ఇఎల్ లక్డీకాపూల్ మెట్రో కారిడార్ అవసరాలపై కూడా దృష్టి సారించాలన్నారు.

8. నానక్‌రామ్‌గూడ జంక్షన్ వద్ద మెట్రో స్టేషన్ నిర్మాణ విషయంలో అక్కడ నాలుగు దిక్కుల నుండి వచ్చే ట్రాఫిక్ విశ్లేషించాలన్నారు. ఇక్కడ నిర్మించబోయే స్కైవాక్ ప్రయాణీకులకు ఉపయోగకరంగా ఉండాలన్నారు. పైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చే వారి ప్రయాణ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలని, దగ్గరలోని ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్ధలాల్లో విశాలమైన పార్కింగ్ సౌకర్యాలు కల్పించే అవకాశాన్ని పరిశీలించనున్నారు.

9. నార్సింగి, కోకాపేట ఇతర సమీప ప్రాంతాలలో వస్తున్న కొత్త కాలనీలు, వాణిజ్య సదుపాయాల అవసరాలను గుర్తించి నార్సింగి జంక్షన్ సమీపంలో నిర్మించే మెట్రో స్టేషన్ స్థానాన్ని ప్లాన్ చేయాలని సూచించారు. పైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు ఆవల నుండి వచ్చే ప్రయాణీకులకు అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఆయనతో పాటు హెచ్‌ఎఎంఎల్ చీప్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ డివిఎస్ రాజు, చీప్ ప్రాజెక్టు మేనేజర్ ఆనంద్‌మెహన్, జనరల్ మేనేజర్లు విష్ణువర్దన్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్ నాయక్, ఇతర సీనియర్ ఇంజనీర్లు పరిశీలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News