Saturday, December 21, 2024

మెట్రో స్టూడెంట్ పాస్

- Advertisement -
- Advertisement -
1998 ఏప్రిల్ 1 తర్వాత పుట్టిన విద్యార్థులే అర్హులు
20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణించే వెసులుబాటు
విద్యార్థికి ఒక స్మార్ట్‌కార్డ్ మాత్రమే జారీ
అందుబాటులోకి తీసుకొచ్చిన మెట్రో అధికారులు

మన తెలంగాణ/హైదరాబాద్ :విద్యార్థుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైల్ సూపర్ సేవర్ స్టూడెంట్ పాస్- 2023ను అమల్లోకి (ఈనెల 01వ తేదీ నుంచి) తీసుకువచ్చామని హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని, మెట్రో ప్రయాణాన్ని మరింత ఆస్వాదించాలని ఆ యన విజ్ఞప్తి చేశారు. 1998 ఏప్రిల్ 1 తర్వాత పు ట్టిన విద్యార్థులందరూ ఈ పాస్ పొందేందుకు అ ర్హులని, ఈ ఆఫర్ కింద విద్యార్థులు 20 ట్రిప్పులకు మాత్రమే డబ్బులు చెల్లించి, అన్ని ఫేర్ జోన్‌లలో 30 ట్రిప్పుల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని ఎండి తెలిపారు. అయితే విద్యార్థులు తప్పనిసరిగా కొత్త బ్రాండెడ్ స్మార్ట్ కార్డ్‌ను కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఒక విద్యార్థికి ఒక స్మార్ట్ కార్డ్ మాత్రమే జారీ చేస్తామని, అది కొనుగోలు చేసిన తేదీ నుంచి 30 రోజుల వరకు చెల్లుబాటు అవుతుందని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ ఆఫర్ జూలై 1, 2023 నుంచి మార్చి 31, 2024 వరకు అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెట్రో స్టేషన్లలో ఈ పాస్‌లను కొ నుగోలు చేయవచ్చన్నారు. సూపర్ సేవర్ మెట్రో పాస్‌లను కొనుగోలు చేసిన విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో రైలుతో అనుసంధానం ఉన్న రిలయ న్స్ ట్రెండ్, 24 సెవెన్ కన్వీనియన్స్ స్టోర్‌లు తదితర వాణిజ్య సంస్థల ద్వారా రాయితీ కూపన్‌లను కూడా పొందవచ్చని తెలిపారు.వివరాలకు వెబ్‌సైట్‌ www.ltmetro.com సందర్శించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News