Monday, December 23, 2024

పెరగనున్న మెట్రో రైలు ఛార్జీలు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: త్వరలో మెట్రో రైలు ఛార్జీలు పెరుగనున్నాయి. చార్జీల సవరింపుపై ప్రజలు, ప్రయాణికులు, ఇతర వర్గాల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఓ కమిటీని కూడా రూపొందించింది. ఈ కమిటీ ప్రజల నుంచి అభిప్రాయాలను, సూచనలను, అభ్యంతరాలను స్వీకరించి మెట్రో చార్జీల పెంపుపై నివేదిక అందజేస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణకు ‘ఫేర్ ఫిక్సేషన్ కమిటీ’ పెట్టిన గడువు ఈ నెల 15తో ముగియనుంది. ప్రజాభిప్రాయ ఆధారంగానే చార్జీలు ఏ మేరకు పెంచాలన్నది కమిటీ ప్రతిపాదించనుంది. నూతన సంవత్సరం నుంచే పెరిగిన చార్జీలు అమలులోకి రావొచ్చని అధికార వర్గాలు తెలిపాయి.ప్రస్తుతం హైదారబాద్‌లో ఎల్బీనగర్ నుంచి మియాపూర్, రాయదుర్గం నుంచి నాగోల్, ఎంజిబిఎస్ నుంచి జెబిఎస్ మార్గాల్లో మెట్రో రైలు తిరుగుతోంది. కరోనా లాక్ డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. చార్జీలు సవరించే సమయం వచ్చిందని ఎల్ అండ్ టి అధికారులు అంటున్నారు. మరి పాత రేట్లపై ఎంత పెంచుతారో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News