Wednesday, January 22, 2025

మెట్రో రైల్ సేవలకు అంతరాయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రయాణానికి బుధవారం ఉదయం కొద్దిసేపు ఆటంకం ఏర్పడింది. సాంకేతిక లోపం కారణంగా నాగోల్- మియాపూర్ రూటులో ఉదయం 10.30 నుంచి సుమారు 15 నిమిషాల సేపు మెట్రో రైల్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అధికారులు హుటాహుటిన రంగంలోకి దిగి, సాంకేతిక లోపాన్ని సరిదిద్దడంతో మెట్రో రైళ్లు తిరిగి యధావిధిగా రాకపోకలు ప్రారంభించాయి. ఉదయం వేళ ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులతో మెట్రో రైళ్లు రద్దీగా ఉంటాయి. ఈ సమయంలో రైల్ సేవలు నిలిచిపోవడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News