తుది మైలు కనెక్టివిటీ కోసం ర్యాపిడోతో భాగస్వామ్యం
ప్రయాణీకుల సంఖ్య కాస్త మెరుగుపడిందని మెట్రో అధికారుల వెల్లడి
హైదరాబాద్ : మెట్రో సువర్ణ ఆఫర్లో భాగంగా నవంబర్ నెల కోసం విజేతలుగా నిలిచిన ఐదుగురికి బహుమతి ప్రదానత్సోవాన్ని ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ నిర్వహించింది. ఈబహుమతి ప్రదానోత్సవ వేడుక సమయంలోనే, భారతదేశంలో అతిపెద్ద బైక్ ట్యాక్సీ ర్యాపిడ్‌తో తమ భాగస్వామ్యాన్ని కూడా హైదరాబాద్ మెట్రో రైల్ వెల్లడించింది. తద్వారా ప్రయాణీకులకు రోజు వారీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది. ఈభాగస్వామ్యంలో భాగంగా ర్యాపిడో ఇప్పడు హైదరాబాద్‌లోని అన్ని మెట్రో స్టేషన్ల వద్ద లభ్యమవుతుంది. ఈబహుమతి ప్రదానోత్సవంలో ఎన్వీఎస్రెడ్డి(ఎండీ. హెచ్‌ఆర్‌ఎంఎల్), కెవీబీరెడ్డి (ఎండీ అండ్ సీఈవో ఎల్ అండ్ టీ ఎంఆర్హెచ్ఎల్), సుధీర్ చిఫ్లుంకర్( సీఓఓ ఎల్అండ్ టి ఎంఆర్హెచ్ఎల్)తో పాటుగా ఆకర్షనీయమైన బహుమతులు పొందిన అదృష్టవంతులైన విజేతలు కూడా పాల్గొన్నారు.
ఈసందర్భంగా హెచ్ఎంఆర్ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ మెట్రో సువర్ణ ఆఫర్‌ను ప్రయాణీకులు అభిమానిస్తున్నారు. విజేతలకు అభినందనలు తెలుపుతూ ఇప్పడు మెట్రో ప్రయాణీకులకు మరో ఉత్సాహపూరితమైన సమాచారం అందిస్తున్నామని లాస్ట్ మైల్ కనెక్టివిటి కోసం ర్యాపిడోతో హెచ్ఎంఆర్ భాగస్వామ్యం చేసుకోవడమని ఇది ఖచ్చితంగా ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుందన్నారు. అనంతరం ఎల్ అండ్ టి ఎంహెచ్ఆర్ఎల్ ఎండీ, సీఈవో కెవీబీ రెడ్డి ప్రసంగిస్తూ మెట్రో సువర్ణ ఆఫర్ విజేతలకు అభినందనలు చెబుతూ ఇటీవల కాలంలో ప్రయాణీకుల సంఖ్య పరంగా కాస్త కదలిక కనిపించింది. అత్యుత్తమ లాస్ట్‌మైల్ కనెక్టివిటి కోసం ర్యాపిడోతో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాట్లు తెలిపారు. ఇది మెట్రో ప్రయాణీకులకు అత్యుత్తమ కనెక్టివిటీ అందిస్తుందని వెల్లడించారు.
ఈసందర్భంగా ఎల్ అండ్ టీ ఎంఆర్హెచ్ఎల్ సీఓఓ సుధీర్ చిఫ్లుంకర్ మాట్లాడుతూ విజేతలందరికి అభినందలు పేర్కొంటూ ర్యాపిడోతోనే మెట్రో బాగస్వామ్యం ఇప్పడు అధిక సంఖ్యలో మెట్రో ప్రయాణీకులకు ప్రయోజనం చేకూర్చనుందన్నారు. ర్యాపిడ్ కో ఫౌండర్ అరవిందా సంకా వివరిస్తూ మెట్రో స్టేషన్ల నుంచి తమ గమ్యం చేరేందుకు వాహనం కనుగొనడంలో ఎక్కువమంది ఇబ్బంది పడుతుండటం గమనించామని, ఈభాగస్వామ్యంతో ఈసమస్య తీరిందన్నారు. హైదరాబాద్ లోపల ప్రయాణీకులకు సౌకర్యవంతమైన అనుభవాలను అందించాలన్నది మా లక్షమన్నారు.