Monday, January 20, 2025

త్వరితగతిన పాతబస్తీలో మెట్రో పనులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : పాతబస్తీలో మెట్రో రైలు పనులు మరింత వేగవంతం కా నున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా మం త్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. పాతబస్తీ మెట్రో పనులను త్వరితగతిన చేపట్టాలని సిఎం కెసిఆర్ మున్సిపల్ శాఖకు సూచించారని కెటిఆర్ ట్వీట్ చేశారు. ఎల్ అండ్ టి సంస్థ చైర్మన్‌తో కూడా సిఎం కెసిఆర్ మాట్లాడారని, పాతబస్తీ మెట్రోరైలు ప నులకు కావాల్సిన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని సిఎం హామీ ఇచ్చారని కెటిఆర్ వెల్లడించారు. పాతబస్తీలో మెట్రో వద్దని గతంలో అనేక మంది గట్టిగా తమ వాదన వినిపించారు. దాదాపు 1000 మతపరమైన సంస్థలు,చరిత్రాత్మక స్థలాలు దెబ్బతినే అవకాశం ఉందని అడ్డుకున్నారు.

ప్ర స్తుతం అక్కడి ప్రజల్లో మార్పు వచ్చింది. త మ ప్రాంతానికి కూడా మెట్రో కావాలని ఎ క్కువ మంది కోరుకుంటున్నారు. ఈ డి మాం డ్ల నేపథ్యంలో అక్కడ మెట్రో నిర్మాణానికి గల అడ్డంకుల విషయమై ప్రభుత్వం స ర్వే చేయించింది. ఆ సర్వే పూర్తవడంతో నిర్మాణ పనులు మొదలు పెట్టాలని ప్రభు త్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ మున్సిపల్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో మూ డు మార్గాల్లో తన సేవలను అందిస్తోంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు రెడ్‌లైన్ సర్వీస్, నాగోల్ నుంచి రాయ్‌దుర్గ్ వరకు బ్లూ లైన్ సర్వీస్, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ఎంజిబిఎస్ వరకు గ్రీన్ లైన్ సేవలను అందిస్తోంది. ప్రతి రోజు దాదాపు 5 లక్షల మంది హైదరాబాద్ మెట్రో సేలలను వినియోగించుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News