Wednesday, January 22, 2025

మెక్సికోలో దారుణం.. 45 బస్తాల్లో మానవ అవశేషాలు

- Advertisement -
- Advertisement -

న్యూమెక్సికో : మెక్సికోలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఉత్తర మెక్సికోలోని గ్వాడలజారా శివార్లలోని ఒక పెద్ద రాళ్ల గుట్టల మధ్య మృత దేహాలున్న సంచులను అధికారులు కనుగొన్నారు. గత వారం తప్పి పోయిన కొందరు యువతీయువకుల కోసం వెదుకుతున్న సమంయంలో ఈ సంచులు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు పశ్చిమ మెక్సికన్ లోని జాలిస్కోలోని ఒక గుంటలో 45 బస్తాలను కనుగొన్నారు.

వాటిని తెరిచి చూస్తే అందులో మానవ శరీర భాగాలు కనిపించాయి. మే 20 నుంచి తప్పిపోయిన ఇద్దరు యువతులు, ఐదుగురు పురుషులను మాత్రమే కాదు గత కొంతకాలంగా కనిపించకుండా పోయిన వ్యక్తుల కోసం అధికారులు అన్వేషణ ప్రారంభించారు. కనిపించకుండా పోయిన యువతీయువకులు ఒకే కాల్ సెంటర్‌లో పనిచేస్తున్నారని.. తప్పిపోయిన వారి గురించి వేర్వేరు రోజుల్లో ఫిర్యాదులు అందాయని పోలీసులు చెప్పారు. మృతదేహాలు లభ్యమైన దగ్గరలోనే కాల్ సెంటర్ ఉంది. అయితే సంఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు మొదలు పెట్టారు.

సంచుల్లో ఉన్న మృతులు ఎంతమంది.. ఎవరెవరు అనే విషయం ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించాల్సి ఉంది. కాల్ సెంటర్ అక్రమ కార్యకలాపాలకు పాల్పడి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో తెలిసినట్లు అధికారులు చెప్పారు. గంజాయితో పాటు దుస్తులపై రక్తపు మరకలు, వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలను కనుగొన్నారని స్థానిక మీడియా నివేదించింది. అయితే అధికారులు బాధితులను నేరస్తులుగా చిత్రీకరించాలని చూస్తున్నారని అదృశ్యమైన వారి బంధువులు ఆరోపిస్తున్నారు.

ఇదిలావుండగా 2021లో జాలిస్కోలోని తోనాలా మున్సిపాలిటీలో 11 మంది మానవ అవశేషాలతో 70 సంచులు కనుగొనబడ్డాయి. 2019లో జపోపాన్‌లోని జనావాసాలు లేని ప్రాంతంలో 119 బ్యాగుల్లో 29 మంది మృతదేహాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సంవత్సరం మొదటి రెండు నెలల్లో 33 మంది అవశేషాలు గ్వాడలజారా ప్రాంతంలో కనిపించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News