Wednesday, January 22, 2025

మెక్సికోకు టైటిల్

- Advertisement -
- Advertisement -

కాలిఫ్: ప్రతిష్టాత్మకమైన కొన్‌కాకఫ్ గోల్డ్ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో మెక్సికో విజేతగా నిలిచింది. కాలిఫ్‌లోని ఇంగిల్‌వుడ్‌లో జరిగిన ఫైనల్లో మెక్సికో 10 తేడాతో పనామాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా శాంటియాగో గిమెనెజ్ కళ్లు చెదిరే గోల్‌తో మెక్సికోకు విజయం సాధించి పెట్టాడు. కీలక సమయంలో లభించిన ఈ గోల్‌తో మెక్సికో ట్రోఫీని దక్కించుకుంది. ఆరంభం నుంచే పోరు నువ్వానేనా అన్నట్టు సాగింది. ఇరు జట్లు కూడా సర్వం ఒడ్డి పోరాడాయి. అయితే గోల్స్ సాధించడంలో మాత్రం విఫలమయ్యాయి. కానీ చివరి నిమిషాల్లో శాంటియాగో సాధించిన కీలక గోల్‌తో మెక్సికో ఛాంపియన్‌గా అవతరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News