Monday, December 23, 2024

మెక్సికోకు ప్రపంచకప్ బెర్త్..

- Advertisement -
- Advertisement -

మెక్సికో: ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు మెక్సికో అర్హత సాధించింది. ఇఎల్ సాల్వడర్‌తో జరిగిన చివరి క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో మెక్సికో 2-0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మెక్సికోకు ఖతార్ వేదికగా ఈ ఏడాది జరిగే ఫిఫా వరల్డ్‌కప్ బెర్త్ ఖాయమైంది. ఉరియల్ అంటునా 17వ నిమిషంలో మెక్సికోకు తొలి గోల్‌ను అందించాడు. ఇక 43వ నిమిషంలో జిమెనెజ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో మెక్సికో 2-0తో మ్యాచ్‌లో గెలిచి ప్రపంచకప్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పటికే అమెరికా, కెనడా జట్లు కూడా వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.

Mexico qualified for Football World Cup 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News