Friday, March 21, 2025

రూ. 118 కోట్ల ధరపలికిన ఎం.ఎఫ్. హుస్సేన్ కళాఖండం

- Advertisement -
- Advertisement -

భారతీయ ప్రఖ్యాత చిత్రకారుడు, కళాకారుడు ఎం.ఎఫ్. హుస్సేన్ గుర్తున్నారా… ఆయన పెయింటింగ్ న్యూయార్క్ లో జరిగిన క్రిస్టీ వేలంలోదాదాపు 118 కోట్ల రూపాయల రికార్డు ధర పలికింది.. మార్చి 19న ఈ వేలం జరిగింది. మాడ్రన్ ఇండియన్ ఆర్ట్ లో అత్యంత ఖరీదైన కళాఖండంగా అవతరించింది. గతంలో అత్యంత ఆధునిక భారతీయ కళాఖండాలలో 1937 లో అమృతా షేర్ – గిల్ చిత్రీకరించిన కళాఖండం ది స్టోరీ టెల్లర్ – దే రికార్డు.దానికన్నా రెట్టింపు ధరపలికి ఎఫ్ ఎం హుస్సేన్ పెయింటింగ్ ఆ రికార్డును తిరగరాసింది.1950 నాటి చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ చిత్రీకరించిన ఈ గ్రామ్ యాత్ర అనే పెయింటింగ్ వేలంలో 13.8 మిలియన్ డాలర్లకు వేలంలో అమ్ముడయింది.

అది 118 కోట్ల రూపాయల కన్నా ఎక్కువే.14 అడుగుల సింగిల్ కాన్వాస్ పై ఎంఎఫ్ హుస్సేన్ ఈ కళాఖండాన్ని ఆవిష్కరించారు.1937 అమృత షేర్ – గిల్ చిత్రీకరించిన – దస్టోరీ టెల్లర్ – పెయింటింగ్ 2023లో ముంబైలో జరిగిన వేలంలో 7.4 మిలియన్ డాలర్లు అంటే.. 61 కోట్ల 80 లక్షల రూపాయలకు వేలంలో అమ్ముడయింది. ఇప్పటివరకూ అత్యంత ఖరీదైన మాడ్రన్ ఇండియన్ ఆర్ట్ అదే.1915 సెప్టెంబర్ 17న మహారాష్ట్రలోని పండరి పూర్‌లో జన్మించిన హుస్సేన్
భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన కళాకారులలో ఒకరిగా నిలిచారు,

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News