- Advertisement -
రూ.2500 కోట్లు పెట్టుబడులు
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది (2022) ఆఖరు నాటికి రూ.2500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్టు ఎంజి మోటార్ ఇండియా ప్రకటించింది. గుజరాత్‌లో హలోల్ ప్లాంట్ వద్ద ఉత్పత్తి సామర్థాన్ని పెంచేందుకు గాను ఈ పెట్టుబడులు పెట్టనున్నామని సంస్థ తెలిపింది. కంపెనీ మిడ్‌సైజ్ ఎస్‌యువి ఆస్టర్‌ను ఆవిష్కరించిన తర్వాత విస్తరణ పనులు వేగవంతం చేసింది. కొరత పరిస్థితులు ఇంకొంత కాలం కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ కంపెనీ గతేడాది (2020)లో 100 శాతం వరకు వృద్ధిని నమోదు చేసింది. ఎంజి మోటార్ ఇండియా ప్రెసిడెంట్, ఎండి రాజీవ్ చాబా మాట్లాడుతూ, ఇప్పటికే రూ.3000 కోట్లు పెట్టుబడులు పెట్టామని, వచ్చే ఏడాది ఆఖరునాటికి రూ.2500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నామని అన్నారు.
- Advertisement -