Monday, December 23, 2024

‘ఉపాధి’కి కేంద్రం ఎసరు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : జాతీయ గ్రామీణ ఉపాధి పథకానికి వార్షిక బడ్జెట్‌లో నిధులపై కోత విధించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఉపాధి హామీ పథకంలో మార్పులకు యోచిస్తోంది. ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం క్రమంగా నిర్వీర్యం చేస్తోందని.. నిధుల కేటాయింపు తగ్గిస్తూ చట్టాన్ని నామమాత్రంగా మిగులుస్తోందని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చే స్తున్నాయి. వంద రోజుల పని దినాల చట్టం ఇప్పుడు 42 పని రోజులకు పడి పోయిందని, తాజా బ డ్జెట్‌లో 33శాతం నిధులకు కోత విధించారని రా ష్ట్రాలు వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే ఈ పథకంలో కూలీల వేతనాలను పూర్తి గా కేంద్రమే ఇప్పటివరకు భరిస్తోంది. తాజాగా కూలీల వేతనాల్లో రాష్ట్రాలు 40 శాతం నిధులను భరించేలా చట్టంలో మార్పులు తెస్తామని ఇటీవల- కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ వెల్లడించారు.

కూలీల వేతనాలను 60:40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉం టుందని, అప్పుడే రాష్ట్రాలు బాధ్యతతో వ్యవహరిస్తాయని- గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. పార్లమెంట్‌లో తాను ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ – 2023-24లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపులో భారీగా కోత విధించారన్న విమర్శలను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపారేశారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఆమె ఈ విషయాన్ని స్పష్టం చేశారు. నరేగాకు నిధులు కేటాయింపులు తగ్గలేదని.. ఈ పథకం డిమాండ్ ఆధారితమైంది గనక అందుకనుగుణంగా నిధులు కేటాయింపులు పెంచుతూ చివరలో సవరణలు చేస్తున్నామన్నారు. గత ఎనిమిది బడ్జెట్లను సమీక్షి స్తే.. ఆ విషయం అర్థమవుతుందని ఆమె వెల్లడించారు. బడ్జెట్ లో నిధులు కేటాయించడం ఒక ఎత్తయితే.. క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షించి డి మాండ్‌కు అనుగుణంగా సవరించడం మరో విధానమని ఆమె తెలిపారు. ఉపాధి హామీ అమలుపై కేంద్ర మంత్రులు పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇవ్వడంతో వివిధ రాష్ట్రాల్లోని ఉపాధి కూలీలు అందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రాలు భరించాలని చెప్పడం.. కేంద్రం తన బాధ్యతలు విస్మరించడమే…

ఉపాధి కూలీల వేతనాలకు ఆధార్ ఆధారిత చెల్లింపులను తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆదేశాలు.. పెద్ద సంఖ్యలో కుటుంబాలను ఆదుకున్న విప్లవాత్మక విధానం బలి అవుతోందని విపక్షాల నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి హామీ దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా నిలిచిందని వారు గుర్తుచేస్తున్నారు. రాష్ట్రాలు భరించాలని చెప్పడం.. కేంద్రం తన బాధ్యతలు విస్మరించడమే అని వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ ఆధారిత చెల్లింపులను పేదల ఆదాయంపై దాడిగా వారు పేర్కొంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 14 రాష్ట్రాలకు కేంద్రం రూ. 6,157 కోట్ల మేర ఉపాధి హామీ బకాయిలు చెల్లించాల్సి ఉందని గుర్తుచేశారు. ఉపాధి పథకం లబ్ధిదారులకు జనవరి నుంచి దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు ఎన్‌ఎంఎంఎస్ డిజిటల్- హాజరుతో పాటు అన్ని చెల్లింపులు ఫిబ్రవరి నుంచి ఆధార్-ఆధారిత చెల్లింపు వ్యవస్థ ( ఎబిపిఎస్) ద్వారా చేయాలని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశాలిచ్చింది.

ఢిల్లీలో ఉపాధి కూలీల ఆందోళన..

ఉపాధి పథకంలో వంద రోజుల పనిదినాలను కల్పించాలని, మొబైల్ ఫోన్ అప్లికేషన్ ఆధారిత హాజరు క్యాప్చర్ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఉపాధి కూలీలు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉపాధి చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం వంద శాతం వేతనాలను భరిస్తుంది. నేరుగా కార్మికుల ఖాతాలకు జమ చేస్తున్నారు. పనిని పూర్తి చేసిన పదిహేను రోజులలోపు బదిలీ
చేస్తున్నారు. తాజాగా కేంద్రం తీసుకున్న విధాన నిర్ణయం మేరకు ఆధార్ ఆధారితంగా ఉపాధి కూలీలకు వేతనాలను అందించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News