Friday, November 22, 2024

ముస్లింయేతర శరణార్థులకు పౌరసత్వం

- Advertisement -
- Advertisement -

MHA invites citizenship applications from non-Muslim refugees

కేంద్రం నోటిఫికేషన్.. సిఎఎకి అతీతం

న్యూఢిల్లీ : ముస్లింయేతర శరణార్థులకు భారత పౌరసత్వం జారీకి దరఖాస్తులు పంపించుకోవాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ మేరకు శనివారం ఓ నోటిఫికేషన్ వెలువరించారు. 1955 సిటిజన్‌షిప్ యాక్ట్ సంబంధిత 2009 రూల్స్ పరిధిలో ఈ అధికారిక ప్రకటన వెలువడింది. అఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ల నుంచి తరలివచ్చిన ముస్లింయేతర వ్యక్తులు గుజరాత్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హర్యానా, పంజాబ్‌లకు చెందిన 13 జిల్లాల్లో ఉంటున్నట్లు అయితే వారు సిటిజన్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.2019 పౌరసత్వ సవరణ చట్టానికి (సిఎఎ) ఈ తాజా ఆదేశాలకు ఎటువంటి సంబంధం లేదు. అప్పటి చట్టం పరిధిలో ఇప్పటికీ పూర్తిస్థాయిలో నిబంధనలను కేంద్రం రాజకీయ వ్యతిరేకతతో ఇప్పటికీ వెలువరించలేదు. ఆయా దేశాలకు చెందిన ముస్లింలు కాని శరణార్థులు పౌరసత్వం పొందడానికి తగు అర్హతలు కలిగి ఉంటే వాటిని తమ దరఖాస్తులలో తెలియచేసుకోవల్సి ఉంటుంది. ఇందులో ఇంతకు ముందటి పౌరసత్వంతో తటస్థీకరణ ఘట్టానికి ప్రధాన షరతుగా ఇక్కడి ఈ 13 జిల్లాలకు వచ్చిన వారు 11 ఏళ్ల నుంచి ఇక్కడనే నివాసం ఉండాలి. సంబంధిత సాక్షాధారాలను పొందుపర్చాలి. పౌరసత్వ చట్టం పరిధిలో ఈ గడువును ఐదేళ్లుగా ఖరారు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News