మన తెలంగాణ/ క్రీడా విభాగం: ప్రపంచ క్రికెట్‌లోనే అత్యంత ఆదరణ కలిగిన లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ట్వంటీ20 టోర్నమెంట్ పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 2008 లో ప్రారంభమైన ఈ లీగ్ ఇప్పటి వరకు 17 సీజన్‌లను పూర్తి చేసుకుంది. 18వ సీజన్‌కు శనివారం తెరలేవనుం ది. ఈసారి కూడా పది జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నా యి. కోల్‌కతాలోని చా రిత్రక ఈడెన్ గార్డెన్స్ మైదానంలో డిఫెండిం గ్ ఛాంపియన్ కోల్‌క తా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ తో సీజన్ 2025 ఆరంభమవుతోంది.
ఐపిఎల్ ప్రా రంభమై ఇప్పటి కే 17 ఏళ్లు గడిచి పోయా యి. అప్పటి నుంచి ఐపిఎల్ లో మూడు జట్లదే హవా నడుస్తోంది. 17 టైటిల్స్‌లో ఈ జట్లే ఏ కంగా13 ట్రోఫీలను సొంతం చేసుకోవడం విశే షం. ఇందులో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఐదేసి ట్రోఫీలను సొంతం చేసుకున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్ మూడు టైటిల్స్‌ను గెలుచుకుంది. ఈ సీజన్‌లో కూడా మూడు జట్లలో ఏదో ఒక టీమ్ ట్రోఫీ సాధించినా ఆశ్చర్యం లేదు. విపరీత పోటీ ఉండే ఐపిఎల్ లాంటి టోర్నమెంట్‌లో ఒక ట్రోఫీని సాధించడమే గగనమనుకుంటే ముంబై, చెన్నై జట్లు ఏకంగా ఐదేసి టైటిల్స్‌తో సత్తా చాటాయి. ఈ రెండు జట్లు ఐపిఎల్ పై తమదైన ముద్ర వేశా యి. ముంబై, చెన్నై విజయాల్లో రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ లు తమదైన పాత్ర పో షించారు. అసాధారణ కెప్టెన్సీతో వీరు తమ త మ జట్లకు టైటిల్స్ సాధించి పెట్టారు. అయితే ఈసారి రెండు జట్లు కూడా ఇతర కె ప్టెన్ల సారథ్యంలో బరిలోకి ది గుతున్నాయి.
కిందటి సీజన్ లో ముంబై టీమ్ యాజమా న్యం రోహిత్ శర్మను పక్కన బె ట్టి హార్దిక్ పాండ్యకు సారథ్య బాధ్యతలను అప్పగించింది. ఈ వ్యూహం బెడిసి కొట్టింది. హార్దిక్ సారథ్యంలోని ముంబై పేలవమైన ప్రదర్శనతో టోర్నమెంట్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. జట్టును ముందుండి నడిపించడంలో హార్దిక్ ఘోరంగా విఫలమయ్యాడు. రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి ముంబై యాజమాన్యం పెద్ద పొరపాటే చేసిందని చెప్పాలి. అయితే ఈసారి కూడా హార్దిక్ సారథ్యంలోనే ముంబై రంగంలోకి దిగుతోంది. ఈసారైనా ముంబై గాడిలో పడుతుందా లేదా చె ప్పలేం. మరోవైపు ఇక చెన్నై టీమ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోనీ తానంతట తానే తప్పుకున్నాడు. అతని స్థానంలో తొలుత రవీంద్ర జడేజాకు కెప్టెన్సీని అప్పగించారు. కానీ కెప్టెన్‌గా జడేజా ఆశించిన స్థాయిలో సత్తా చాటలేక పోయా డు. దీంతో కిందటి సీజన్‌లో రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఈ సీజన్‌లో కూడా అత నే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు.
జట్టును ముందుండి నడిపించాల్సిన బాధ్యత రుతురాజ్‌పై నెలకొంది. అతను సారథిగా ఎంత వరకు సఫలమవుతాడో చెప్పలేం. ఇక ప్రస్తుత ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ కూడా నాలుగో టైటిల్‌పై కన్నేసింది. కిందటి సీజన్‌లో జట్టుకు కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా రిటేన్ చేసుకోలేదు. కాగా, శ్రేయస్‌ను మెగా వేలం పాటలో భారీ మొత్తం ధరకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుని సారథ్య బాధ్యతలను అప్పగించింది. ఈసారి కోల్‌కతా అజింక్య రహానె కెప్టెన్సీలో బరిలోకి దిగుతోంది. అపార అనుభవజ్ఞుడైన రహానె జట్టును ముందుండి నడిపించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆరో టైటిల్ దక్కేనా?
మరోవైపు ఈ సీజన్‌లో ముంబై, చెన్నై జట్లు భారీ ఆశలతో బరిలో దిగనున్నాయి. ఇప్పటికే ఐదేసి టైటిల్స్ సాధించిన ఈ జట్లు ఆరో ట్రోఫీపై కన్నేశాయి. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ముంబై, చెన్నై జట్లు టైటిల్‌పై కన్నేశాయి. రుతురాజ్ సారథ్యంలోని చెన్నై టీమ్‌లో ధోనీ, శివమ్ దూబే, రచిన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి, డెవోన్ కాన్వే, జడేజా, అశ్విన్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ముంబైలో కూడా అగ్రశ్రేణి ఆటగాళ్లకు కొదవలేదు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, విల్ జాక్స్, ట్రెంట్ బౌల్ట్, బుమ్రా వంటి స్టార్‌లు ఉన్నారు. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో ముంబై కూడా టైటిల్ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.