Friday, January 24, 2025

ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్‌గా బౌచర్

- Advertisement -
- Advertisement -

MI Appointed Mark Boucher as Head Coach

ముంబై: రానున్న ఐపిఎల్ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్ దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం మార్క్ బౌచర్‌ను ప్రధాన కోచ్‌గా ఎంపిక చేశారు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు ముంబైకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన శ్రీలంక గ్రేట్ మహేల జయవర్ధనే స్థానంలో బౌచర్‌ను కోచ్‌గా ఎంపిక చేశారు. జయవర్ధనేను ఫ్రాంచైజీ గ్లోబల్ హెడ్‌గా పదోన్నతి కల్పించారు. ఇక బౌచర్ ఎంపిక విషయాన్ని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంచానీ ధ్రువీకరించారు. మైదానం లోపల, బయట బౌచర్‌కు ఉన్న అనుభవం జట్టుకు కలిసివస్తుందనే నమ్మకాన్ని ఆకాశ్ వ్యక్తం చేశారు. బౌచర్ పర్యవేక్షణలో ముంబై ఇండియన్స్ విజయపథంలో దూసుకెళుతుందనే నమ్మకం తమకుందన్నారు. ఇక తనను ప్రధాన కోచ్‌గా నియమించడంపై బౌచర్ ఆనందం వ్యక్తం చేశాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముంబై ఇండియన్స్‌ను మరింత బలమైన జట్టుగా తీర్చిదిద్దడమే లక్షమని బౌచర్ స్పష్టం చేశాడు.

MI Appointed Mark Boucher as Head Coach

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News