- Advertisement -
ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ముంబయి ముందు 177 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. రవీంద్ర జడేజా, శివమ్ దూబే హాఫ్ సెంచరీలతో చెలరేగారు. అయుష్ మాత్రే 15 బంతుల్లో 32 పరుగులు చేసి విశ్వరూపం చూపించాడు. మిగిలిన బ్యాట్స్‌మెన్లు విఫలమయ్యారు. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు, దీపక్ చాహర్, అశ్వానీ కుమార్, మిచెల్ శాంట్నార్ తలో ఒక వికెట్ తీశారు.
- Advertisement -