Monday, March 31, 2025

బోణీ కొట్టేదెవరో?

- Advertisement -
- Advertisement -

నేడు ముంబైతో గుజరాత్ పోరు
అహ్మదాబాద్: ఐపిఎల్‌లో భాగంగా శనివారం జరిగే కీలక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ సీజన్‌లో తొలి విజయం కోసం రెండు జట్లు తహతహలాడుతున్నాయి. ముంబై, గుజరాత్ తమ తమ ఆరంభ మ్యాచుల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బోణీ కొట్టేందుకు సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు.

శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, తెవాటియా, రూథర్‌ఫోర్ట్, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్ వంటి స్టార్ ఆటగాళ్లు గుజరాత్‌లో ఉన్నారు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ విజయం కోసం తీవ్రంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈసారి మాత్రం ఎలాగైనా గెలవాలని భావిస్తోంది. ముంబైలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. రోహిత్, జాక్స్, రికెల్టన్, సూర్యకుమార్, హార్దిక్, తిలక్ వర్మ వంటి మ్యాచ్ విన్నర్లు జట్టులో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా ముంబై బాగానే ఉంది. రెండు జట్లలోనూ ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖా.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News