Wednesday, January 22, 2025

ముంబైకి సవాల్…. నేడు కోల్‌కతాతో కీలక పోరు

- Advertisement -
- Advertisement -

ముంబై: వరుస ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్‌కు ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగే మ్యాచ్ సవాల్‌గా మారింది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన ముంబై కేవలం ఒక దాంట్లో మాత్రమే విజయం సాధించింది. ఇక కోల్‌కతాకు కూడా ఈ మ్యాచ్ కీలకమేనని చెప్పాలి. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. అంతేగాక కోల్‌కతా మెరుగైన రన్‌రేట్ వల్ల ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి మరింత మెరుగైన స్థానానికి చేరుకోవాలనే పట్టుదలతో కోల్‌కతా ఉంది. అయితే హైదరాబాద్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఓటమి పాలు కావడం కోల్‌కతాకు కాస్త ఇబ్బందిగా మారింది.

కానీ ఆ మ్యాచ్‌లో విజయం కోసం తీవ్రంగా పోరాడడంతో నైట్‌రైడర్స్ ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో కోల్‌కతా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో నైట్‌రైడర్స్ సమతూకంగా ఉంది. అయితే ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ వైఫల్యం జట్టును వెంటాడుతోంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా వీరు తమ బ్యాట్‌కు పనిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రింకు సింగ్‌తో పాటు వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసి వచ్చే అంశమే. మరోవైపు కిందటి మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించి సీజన్‌లో బోణీ కొట్టిన ముంబై ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే ఇషాన్ కిషన్, సూర్యకుమార్‌ల వైఫల్యం జట్టును వెంటాడుతోంది. ఈ మ్యాచ్‌లో బ్యాటర్లు మెరుగైన ప్రదర్శన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాక బౌలర్లు కూడా మరింత మెరుగ్గా రాణించక తప్పదు. అప్పుడే ముంబైకి గెలుపు అవకాశాలుంటాయి.

Also Read: ఢిల్లీపై గెలిచిన బెంగళూరు

రాజస్థాన్‌తో గుజరాత్ ఢీ

అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రాత్రి జరిగే మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. రెండు జట్లు కూడా సీజన్‌లో మూడేసి విజయాలు సాధించాయి. అయితే రాజస్థాన్ మెరుగైన రన్‌రేట్‌తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇటు గుజరాత్ అటు రాజస్థాన్‌లోనూ ప్రతిభావంతులైన క్రికెటర్లకు కొదవలేదు. సాహా, శుభ్‌మన్ గిల్, హార్దిక్, సాయి సుదర్షన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జరీ జోసెఫ్ తదితరులతో గుజరాత్ బ్యాటింగ్ బలంగా ఉంది. ఇక రాజస్థాన్ టీమ్‌లో సంజూ శాంసన్, బట్లర్, యశస్వి జైస్వాల్, పడిక్కల్, అశ్విన్, హెట్‌మెయిర్ వంటి స్టార్ బ్యాటర్లు ఉన్నారు. దీంతో రాజస్థాన్ కూడా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News