- Advertisement -
ఢిల్లీపై 12 పరుగులతో గెలుపు
న్యూఢిల్లీ: వరుస విజయాలతో దూసుకుపోతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముంబై ఇండియన్స్ చెక్ పెట్టింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణించిన ముంబై 12 పరుగుల తేడా గెలుపొంది. ముంబై నిర్ధేశించిన 205 పరుగుల లక్ష ఛేదనకు దిగిన క్యాపిటల్స్‌ను ముంబై బౌలర్లు 193 పరుగులకే కట్టడి చేశారు. ఢిల్లీ బ్యాటర్లలో కరుణ్ నాయర్(89), అభిషేక్ పోరెల్(33)లు తప్ప మరెవరూ రాణించకపోవడంతో ఢిల్లీ తొలి ఓటమిని మూటగట్టుకుంది. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా.. సాట్నర్ రెండు, బుమ్రా, దీపక్ చాహార్‌లు చెరో వికెట్ దక్కించుకున్నారు.
- Advertisement -