Wednesday, January 22, 2025

టీమిండియాను ఓడించిన జట్టే విశ్వవిజేతగా నిలుస్తుంది..

- Advertisement -
- Advertisement -

లండన్: ఇంగ్లండ్ జట్టు మాజీ సారధి, దిగ్గజ ఆటగాడు మైఖేల్ వాన్ టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘సీనియర్లు రోహిత్, విరాట్, హార్ధిక్ పాండ్యలు లేకున్నా టీమిండియా 400 పరుగుల మార్క్‌ను చేరుకోవడంతో నాకు టీమిండియాపై ఓ స్పష్టత వచ్చింది. భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్‌లో ఏ జట్టయితే టీమిండియాను ఓడిస్తుందో ఆ జట్టే విశ్వవిజేతగా నిలిచి వరల్డ్ కప్ కైవసం చేసుకుంటుందని, సొంత గడ్డపై టీమిండియా బ్యాటింగ్ లైనప్ చాలా పటిష్టంగా ఉంది. ఇక బౌలింగ్‌లోనూ కుదురుకున్నారు. వారిని ఆపాలంటే ఒత్తిడిలోకి నెట్టడమే’ అని ‘x’ ఖాతాలో పోస్ట్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News