Monday, November 18, 2024

అక్కడ తీరం దాటనున్న మిచాంగ్ తుఫాన్… ఎపిలో భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుపాను కదులుతోంది. మిచాంగ్ తుఫాన్ గంటకు 14 కిలో మీటర్ల వేగంతో కదులుతుంది. చెన్నైకు 130 కిలో మీటర్ల దూరం, నెల్లూరుకు 220 కిలో మీటర్ల, బాపట్లకు 330 కిలో మీటర్లు, మచిలీపట్నానికి 350 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సోమవారం కోస్తా తీరానికి సమాంతరంగా తుఫాను పయనించనుంది. మంగళవారం మధ్యాహ్నం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉంది. నెల్లూరు-మచిలీపట్నం మధ్య మిచాంగ్ తీరం దాటనుంది.

నేడు, రేపు కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడ అతిభారీ వర్షాలు పడే అవకాశ ఉంది. రాయల సీమలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉతరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మత్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News