మిచాంగ్ తుఫాను ప్రభావంతో తమిళనాడు రాష్ట్రం అతలాకుతలమవుతోంది. రోడ్లపై చెట్లు విరిగిపడి, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. చెన్నైలోని పలు ప్రాంతాల్లో రోడ్లు నీట మునిగిపోయాయి. రోడ్డు పక్కన పార్క్ చేసిన కార్లు నీళ్లలో కొట్టుకుపోయాయి. పల్లికరానే, వీలాచెరి తదితర ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోవడం కనిపించింది. చెన్నైలోని సబ్ వేల్లోకి నీరు చేరడంతో వాటిని మూసివేశారు. చెన్నైలోని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నైనుంచి రాకపోకలు జరిపే పలు రైళ్లను రద్దు చేశారు. కోయంబత్తూరు-చెన్నై మార్గంలో తమ విమాన సర్వీసులను ఇండిగో రద్దు చేసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మరో 24 గంటలపాటు తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి.
#WATCH | Tamil Nadu: A car was seen stuck in the massive waterlogging in Chennai's Velachery and Pallikaranai areas, caused due to heavy rainfall
(Video source: A local present at the site of the incident) pic.twitter.com/Lvl9MJnw0N
— ANI (@ANI) December 4, 2023