Thursday, January 23, 2025

మధ్యాహ్నం తీరం దాటనున్న ‘మిగ్జాం’ తుఫాన్.. ఎపి, తెలంగాణలో భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

మిగ్జాం తుఫాన్ ప్రభావంతో ఎపి, తెలంగాణలో నేడు, రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్ తీవ్ర తుఫాన్ గా మారింది. ఈ రోజు మధ్యాహ్నానికి మిచాంగ్ తుఫాన్..నెల్లూరు-మచిలీపట్నం మధ్య బాపట్లకు సమీపంలో తీరం దాటనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

ఈ సమయంలో తీరం వెంబడి గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో బలంగా ఈదురుగాలులు వీయనున్నాయి. దీంతో కోస్తాంధ్రలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురియనున్నాయి.

రేపు రాయలసీమ, ఉత్తారంధ్రలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈక్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తెలంగాణలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందిన వాతావరణ శాఖ తెలిపింది.

తుఫాన్ ప్రభావంతో గన్నవరం నుంచి విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, షిర్డీ, కడప, ఢిల్లీ నడిచే 15 విమాన సర్వీసులు రద్దు చేశారు. విశాఖ నుంచి వెళ్లాల్సిన 23 విమాన సర్వీసులు కూడా రద్దు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News