Monday, December 23, 2024

భారత ప్రజల సంస్కృతిపై రాక్‌స్టార్ మైక్ జాగెర్ ఆనందం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లెజెండరీ రాక్‌స్టార్ మైక్ జాగెర్ భారత్ పర్యటనలో తాను ప్రజల కళాసంస్కృతి, ఆదరాభిమానాలకు ఆనందం చెందుతున్నానని తన స్పందన తెలియజేయడంపై ప్రధాని మోడీ భావోద్వేగం చెందారు. ఈమేరకు శనివారం తన స్పందన తెలియజేశారు. జాగెర్ శుక్రవారం తన ఎక్స్ పోస్ట్ ద్వారా పాటలు పాడుతూ భారత్‌లో తాను పర్యటించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. “ భారత్‌కు కృతజ్ఞతలు. ఇక్కడ నుంచి తాను అన్నీ పొందగలిగేను.

రొటీన్ దైనందిన కార్యక్రమాల నుంచి దూరంగా అనుభూతి చెందగలిగేను. భారత్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది” అని ఎక్స్ ద్వారా తెలియజేశారు. ఇటీవల జాగెర్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌ను వీక్షించారు. దీనికి ప్రధాని మోడీ తన మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్ ద్వారా తన స్పందన కృతజ్ఞతా పూర్వకంగా తెలియజేశారు. “మీరేం కోరుకుంటారో ఎప్పుడూ పొందలేరు. కానీ భారత్ కళాన్వేషకుల భూమి. ఓదార్పు, సంతృప్తి అందిస్తుంది. ఇక్కడి ప్రజల కళాసంస్కృతితో మీరు ఆనందాన్ని పొందారని తెలిసి ఆనందించగలుగుతున్నాను” అని మోడీ తన స్పందన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News