Thursday, January 23, 2025

మైక్రో ల్యాబ్స్‌కు ఐపిఎ ఊరట

- Advertisement -
- Advertisement -

Micro Labs gets clean chit from pharma body

వైద్యులకు రూ.1000 కోట్ల ఉచితాలు అవాస్తవమని నివేదిక

న్యూఢిల్లీ : డోలో 650 తయారీ సంస్థ మైక్రో ల్యాబ్స్‌కు ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపిఎ) ఊరటనిచ్చింది. వైద్యులకు వెయ్యికోట్ల రూపాయల విలువైన ఉచితాలను లంచాలను మైక్రో ల్యాబ్స్ అందించందనేది నిజం కాదని ఐపి ఎ నివేదిక సమర్పించింది. ఒక సంవత్సరంలో డోలో 650ను ప్రమోట్ చేసేందుకు రూ.1000 కోట్లు ఉచితాలను వైద్యులకు అందించిందనేది వాస్తవం కాదని ఐపిఎ తేల్చింది. ఈ మేరకు దర్యా ప్తు నివేదికను నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథార్టీ (ఎన్‌పిపిఎ)కు అందజేసింది. మైక్రో లాబ్స్‌పై ఎన్‌పిపిఎకి వైద్యసంఘాల నుంచి ఫిర్యాదులు అందాయి. దీంతో వైద్యులకు ఉచితాల ఆరోపణలపై ఐపిఎ దర్యాప్తు చేయాల్సిందిగా ఎన్‌పిపిఎ కోరింది.

యూనిఫాం కోడ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ ప్రకారం దర్యాప్తు చేయాలని కోరడంతో ముగ్గురు సభ్యుల అంతర్గత కమిటీ ఈ విషయాన్ని దర్యాప్తు చేసింది. మైక్రో ల్యాబ్స్ మొత్తం టర్నోవర్ రూ. 4500 కోట్లుగా పేర్కొన్న కమిటీ వీటిలో రూ. 2,500కోట్లు దేశీయ విక్రయాలుగా పేర్కొంది.ఒక సంవత్సరంలోనే వైద్యులకోసం రూ.వెయ్యికోట్లు ఖర్చు చేశారనేది అవాస్తవమని నివేదించింది. గత నాలుగేళ్లలో ప్రతి ఏడాది దేశీయ అమ్మకాల కోసం మైక్రోల్యాబ్స్ సరాసరి రూ.200కోట్లు ఖర్చుపెట్టిందని ఐపిఎ నివేదికలో పేర్కొంది. డోలో 650 మోతాదు ధరల నియంత్రణలో ఉందా లేదా అనేది కూడా ఐపిఎ పరిశీలించింది. 2018లో డోలోను ఇండియన్ ఫార్మాకోపోయియే ఆమోదించిందని ఐపిఎ నివేదికలో పేర్కొంది. జాతీయ నిత్యావసర ఔషధాల జాబితాలో డోలో 650 ఉందని స్పష్టం చేసింది. డోలో జాతీయ అత్యవసర ఔషధాల జాబితాలో 2016 నుంచి ఉందని, 2021లో డోలో 650 ఒక ట్యాబ్లెట్ ధర రూ. 1.84గా నివేదికలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News