Monday, December 23, 2024

హైదరాబాద్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ ప్రారంభించిన మైక్రోచిప్ టెక్

- Advertisement -
- Advertisement -

స్మార్ట్, కనెక్టెడ్, సురక్షితమైన ఎంబెడెడ్ కంట్రోల్ సొల్యూషన్‌ల కు సంబంధించి అగ్రగామి సంస్థలలో ఒకటిగా వెలుగొందుతున్న మైక్రోచిప్ టెక్నాలజీ ఇన్‌కార్పొరేటెడ్, ఈ రోజు కోకాపేట్ బిజినెస్ డిస్ట్రిక్ట్ వన్ గోల్డెన్ మైల్ ఆఫీస్ టవర్‌లో హైదరాబాద్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మైక్రోచిప్ యొక్క కొత్త డెవలప్‌మెంట్ సెంటర్ బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, పూణె, న్యూఢిల్లీలోని సేల్స్ ఆఫీసులతో పాటు బెంగుళూరు, చెన్నైలోని మరో రెండు డెవలప్‌మెంట్ సెంటర్‌లతో చేరబోతుంది.ప్రతిభావంతులైన వర్కుఫోర్స్ ను పెంపొందించటం, అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతీయ సెమీకండక్టర్ హబ్‌లో తన కార్యకలాపాలు పెంచుకునే లక్ష్యంతో కంపెనీ ప్రకటించిన బహుళ-సంవత్సరాల పెట్టుబడి కార్యక్రమంలో ఒక కీలకమైన అంశం.

“భారతదేశంలో దాదాపు 25 సంవత్సరాలు విజయవంతంగా కార్యకలాపాలను నిర్వహించిన అనుభవం తో ఈ కొత్త సదుపాయం రాబోయే సంవత్సరాల్లో మైక్రోచిప్ వృద్ధి ప్రణాళికలను అమలు చేయడానికి మాకు తోడ్పడుతుంది ” అని మైక్రోచిప్ ప్రెసిడెంట్ మరియు సీఈఓ గణేష్ మూర్తి అన్నారు. “ఈ సెంటర్ భారతదేశంలోని అగ్రశ్రేణి వ్యాపార కారిడార్‌లలో ఉండటంతో, గ్లోబల్ మైక్రోచిప్ వ్యాపార అవసరాలకు మరియు ఈ ప్రాంతంలో పెరుగుతున్న మా కస్టమర్ బేస్‌కు మద్దతుగా హెడ్‌కౌంట్‌ను గణనీయంగా విస్తరించడానికి మాకు దోహద పడుతుంది ” అని అన్నారు

మైక్రోచిప్ 15-అంతస్తుల వన్ గోల్డెన్ మైల్ ఆఫీస్ టవర్‌లో 168,000 చదరపు అడుగుల R&D సెంటర్ కోసం ఐదు అంతస్తులను కొనుగోలు చేసింది. ఈ రోజు జరిగిన కార్యక్రమంలో కె.టి. రామారావు, తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, జయేష్ రంజన్, ప్రిన్సిపల్ సెక్రటరీ IT, IBC తెలంగాణ ప్రభుత్వం, కృష్ణ మూర్తి, ఇండియా ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు సీఈఓ, గణేష్ మూర్తి, మైక్రోచిప్ ప్రెసిడెంట్, సీఈఓ, శ్రీకాంత్ సెట్టికెరె, మైక్రోచిప్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ పాల్గొన్నారు.

“హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను విస్తరించేందుకు సరికొత్త గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా మైక్రోచిప్‌ని మేము అభినందిస్తున్నాము” అని కెటిఆర్ చెప్పారు. “టాలెంట్ పూల్ పెంపుదల, కార్పొరేట్ వృద్ధికి మద్దతుగా ప్రపంచ స్థాయి వ్యాపార మౌలిక సదుపాయాలను మేము సఫలవంతంగా రూపొందించాము. అదనపు పెట్టుబడుల పై మా నిబద్ధత ఈ విషయాన్ని మరింత గా ధృవీకరిస్తుంది” అని అన్నారు.

“హైదరాబాద్‌లో ఇప్పటి వరకు మైక్రోచిప్ సాధించిన విజయాలకు, ఇక్కడ వృద్ధిని కొనసాగించడానికి అది పెట్టుకున్న లక్ష్యాలను మేము అభినందిస్తున్నాము” అని రంజన్ చెప్పారు. ” హైదరాబాద్ వ్యాపార సంఘంలో దీర్ఘకాల సభ్యత్వం ఉన్న మైక్రోచిప్, భవిష్యత్తులో కంపెనీకి, ఉద్యోగులకు, కస్టమర్‌లకు ఉత్తమ సేవలనందించటానికి రూపొందించిన ఈ సదుపాయాన్ని మేము సంతోషం గా ప్రారంభిస్తున్నాము” అని అన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News