Monday, December 23, 2024

రూ.500 కోట్ల పెట్టుబడి..ముందుకొచ్చిన మైక్రోలింక్ నెట్ వర్క్స్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అమెరికా టెలికమ్మూనికేషన్స్ దిగ్గజం మైక్రోలింక్ నెట్ వర్క్ రూ.500 కోట్ల పెట్టుబడితో తెలంగాణాలో తమ ఎలక్ట్రానిక్, ఇతర ఉత్పత్తుల కేంద్రాలను ఏర్పా టు చేసేందుకు ముందుకొచ్చిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. హైదరాబాద్‌కు చెందిన పిఎస్‌ఆర్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో మైక్రోలింక్ పరిశ్రమల క్లస్టర్ ను ప్రారంభిస్తుందని తెలిపారు. గురువారం మైక్రోలింక్ గ్లోబల్ ప్రతినిధులు, భారతీయ భాగస్వామి ‘పిఎస్ ఆర్ ఇండస్ట్రీస్ చైర్మన్ శ్రీ రంగారావు మంత్రితో సచివాలయంలో సమావేశమయ్యారు.

వచ్చే మూడేళ్లలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రానిక్, ఐటీ, నిర్మాణరంగ పరికరాలను ఉత్పత్తి చేస్తుందని, దీనిద్వారా 700 మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి చెప్పారు. డేటా ట్రాన్స్ మిషన్, నెట్ వర్కింగ్ కేబుల్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మల్టీ లెవెల్ పార్కింగ్ మిషన్ల ఉత్పత్తిలో మైక్రోలింక్ నెట్ వరక్స్ గ్లోబల్ లీడర్ గా ఉంది. తెలంగాణలో నైపుణ్యం ఉన్న సిబ్బందికి కొరతలేదని మంత్రి వెల్లడించారు. సమావేశంలో పిఎస్ ఆర్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ శ్రీరంగారావు, డైరెక్టర్ న మ్యుత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధర్మరాజు చక్రవరం, మైక్రోటెక్ గ్లోబల్ ప్రతినిధులు డా. డెనిస్ మొ టావా, సియాన్ ఫిలిప్స్, జో జోగ్భి, అశోక్ పెర్సోత్తమ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News