Sunday, December 22, 2024

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్: హర్షం వ్యక్తం చేసిన కెటిఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ రంగానికి మరింత ఊతమిచ్చే రీతిలో హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ సంస్థ అతి పెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. దీని కోసం మైక్రోసాఫ్ట్ సుమారుగా రూ.15 వేల కోట్లను పెట్టుబడిగా పెడుతోంది. ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్‌కు ఇండియాలో మూడు డేటా సెంటర్లు ఉన్నాయి. పూణే, చెన్నై, ముంబై నగరాల్లో ఉన్న డేటా సెంటర్లకు అదనంగా హైదరాబాద్‌లో కొత్త డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇది ఇండియాలోనే లార్జెస్ట్ డేటా సెంటర్ కావడం విశేషం. 2025 నుంచి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ ఆపరేషన్స్ ప్రారంభం కానున్నాయి. క్లౌడ్, ఎఐ ఆధారిత డిజిటల్ ఎకానమీ కస్టమర్లకు సాయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యూహాత్మకంగా ఈ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. దేశంలో డేటా అవసరాలు రోజురోజుకు పెరిగిపోతుండగా, సెంటర్లను నెలకొల్పడానికి పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈ సంస్థలను ఆకర్షించడంలో హైదరాబాద్ నగరం ముందు వరుసలో ఉన్నట్లు కన్సల్టింగ్ సేవల సంస్థ జేఎల్‌ఎల్ ఇటీవల ‘డేటా సెంటర్ మార్కెట్ అప్‌డేట్’ నివేదికలో పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం దేశంలోని డేటా సెంటర్ల సామర్థం 30 మెగావాట్ల వరకూ ఉండగా, అది 2023 నాటికి 90 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. ఇతర నగరాలతో పోలిస్తే స్థిరాస్తి వ్యయం తక్కువగా ఉండటం, ప్రభుత్వ సానుకూల విధానాలు, ఐటి నిపుణుల లభ్యత వంటి కారణాలతో డేటా కేంద్రాలు ఏర్పాటుకు కంపెనీలు హైదరాబాద్ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. నగరంలో దశాబ్దా కాలంగా వీటిని కంట్రోల్ ఎస్ అనే సంస్థ నిర్వహిస్తోంది. ఇటీవల అమెజాన్ ఏర్పాటు చేయగా.. ర్యాక్ బ్యాంక్ అనే మరొక సంస్థ హైదరాబాద్‌ను ఎంచుకుంది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్, మరికొన్ని కంపెనీలు త్వరలో చేరబోతున్నాయనేది స్పష్టమవుతోంది.దీని వల్ల మరింత మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.
హర్షం వ్యక్తం చేసిన కెసిఆర్
హైదరాబాద్‌ను డేటా సెంటర్‌గా ఎంపిక చేసిన మైక్రోసాఫ్ట్ కంపెనీ నిర్ణయం పట్ల తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి రానున్న అతి పెద్ద ఎఫ్‌డిఐ ఇదే అవుతుందన్నారు. మైక్రోసాఫ్ట్, తెలంగాణకు సుదీర్ఘ చరిత్ర ఉందని, హైదరాబాద్‌లో అత్యంత పెద్ద డేటా సెంటర్‌ను ఆ కంపెనీ ఓపెన్ చేయడం సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. తెలంగాణమైక్రోసాఫ్ట్ మధ్య రిలేషన్ పెరగడం ఆనందంగా ఉందని చెప్పారు. అటు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సపోర్ట్‌ను మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత మహేశ్వరి ప్రశంసించారు.

Microsoft announces to Establish Data Center in Hyderabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News