Monday, December 23, 2024

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుమారుడు మృతి

- Advertisement -
- Advertisement -

Microsoft CEO Satya Nadella's son passed away

వాషింగ్ట‌న్ : మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల సోమవారం ఉదయం మరణించాడు. అతని వయస్సు 26. పుట్టుక‌తోనే జైన్ నాదెళ్ల మ‌స్తిష్క ప‌క్ష‌వాతంతో బాధ‌ప‌డుతున్నారు. అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న జైన్ చిన్న‌ప్ప‌ట్నుంచే వీల్ చైర్‌కు ప‌రిమితమయ్యారు. నివేదికల ప్రకారం జైన్ సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. జైన్ నాదెళ్ల తుది శ్వాస విడిచినట్లు సాఫ్ట్‌వేర్ తయారీదారు తన ఎగ్జిక్యూటివ్ సిబ్బందికి ఇమెయిల్‌లో వెల్లడించింది. సత్యనాదెళ్ల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని కోరింది. 2014లో మైక్రోసాఫ్ట్​ సీఈవోగా బాధ్యతలు తీసుకున్న సత్యనాదెళ్ల దివ్యాంగులకు ఉపయోగపడే ఉత్పత్తులను రూపొందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తన కుమారుడు జైన్​ను పెంచే క్రమంలో నేర్చుకున్న విషయాలను తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News