Monday, January 20, 2025

మైక్రోసాఫ్ట్ గిట్‌హబ్‌లో 142 మంది ఇంజనీర్లపై వేటు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : మైక్రోసాఫ్ట్ కంపెనీ గిట్‌హబ్‌లో భారీగా 142 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ మొత్తం భారతీయ ఇంజనీరింగ్ బృందంపై వేటు వేసింది. అమెరికా తర్వాత గిట్‌హబ్ అతిపెద్ద ఇంజనీరింగ్ బృందం భారతదేశంలోనే ఉంది. భారతీయ ఇంజనీర్లందరినీ తొలగించాలని కంపెనీ నిర్ణయించింది.

దీంతో 142 మంది ఉద్యోగులపై ప్రభావం పడింది. మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని కంపెనీ గిట్‌హబ్ భారతదేశంలోని మొత్తం ఇంజనీరింగ్ బృందాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించిందని టెక్ రచయిత గెర్గాలీ ఓరోజ్ తెలిపారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో కంపెనీ టీమ్ తక్కువగా ఉన్నందున కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని గెర్గాలీ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News