Wednesday, January 22, 2025

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల తొలగింపు

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్ : అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగులను తొలగించింది. ఈసారి కస్టమర్ సర్వీస్, సపోర్ట్, సేల్స్ టీమ్స్‌లో దాదాపు 276 మంది ఉద్యోగులను ఇంటికి పంపింది. తాజా ఉద్యోగాల కోతలు జనవరి 18న మైక్రోసాఫ్ట్ ప్రకటించిన 10 వేల గ్లోబల్ లేఆఫ్‌లను మించిపోయాయని గీక్ వైర్ నివేదిక తెలిపింది. వాషింగ్టన్ స్టేట్‌లో మైక్రోసాఫ్ట్ 276 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ తొలగింపుతో కంపెనీకి చెందిన బెల్లెవూ, రెడ్‌మండ్ ఆఫీస్‌లలో 210 మంది సిబ్బంది, 66 మంది వర్చువల్ సిబ్బందిపై ప్రభావం పడనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News