Thursday, January 2, 2025

తెలంగాణలో ఆరు డేటా కేంద్రాలను ఏర్పాటు చేయనున్న మైక్రోసాఫ్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌: మైక్రోసాఫ్ట్‌ సిఇఒ సత్య నాదెళ్లతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం ముగిసింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సిఎం రేవంత్‌రెడ్డితో తొలిసారి మైక్రోసాఫ్ట్‌ సిఇఒ సత్యనాదెళ్ల భేటీ అయ్యారు. స్కిల్‌ యూనివర్సిటీ, ఎఐ క్లౌడ్‌ కంప్యూటింగ్‌పై చర్చ జరిగింది. తెలంగాణలో 6 డేటా కేంద్రాలను ఏర్పాటు చేయనున్న మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. ఆరు డేటా సెంటర్లకు రూ.32 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. డేటా సెంటర్ల పనులు 70 శాతం పూర్తయ్యాయని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సత్య నాదెళ్లను సిఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, సిఎస్‌ శాంతకుమారి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News