Friday, December 20, 2024

ఉద్యోగులకు మైక్రోసాఫ్ట్ సె‘లవ్’

- Advertisement -
- Advertisement -

కోరుకున్నన్ని రోజులు వేతన సెలవులు

న్యూయార్క్ : ప్రపంచ సాప్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు అపరిమిత సెలవుల వరం ఇచ్చింది. వచ్చే వారం నుంచి కంపెనీలోని నిర్ణీత కీలకమైన స్థాయిల్లోని ఉద్యోగులు తాము కోరుకున్నన్ని సెలవులను పొందవచ్చు. ఈ సెలవుల విరామ కాలం వారికి వేతనాలతో కూడి ఉంటుందని అధికారికంగా తెలిపారు. ఇప్పటివరకూ ఉద్యోగులకు నాలుగు వారాల సెలవుల విధానం ఉంది. దీనిని సవరిస్తూ ఇప్పుడు తమ ఉద్యోగులకు సంస్థ యాజమాన్యం అపరిమిత పెయిడ్ టైమ్ ఆఫ్ అంటే వేతనాలతో కూడిన సెలవులకు అనుమతిని ఇచ్చింది.

ఇప్పటివరకూ ఈ వెసులుబాటు ఏ కంపెనీ ఉద్యోగులకు లేదు. ఈ విధమైన చెల్లింపులతో కూడిన సెలవు విధానం తమ కంపెనీ ఉద్యోగుల పట్ల ఉదారభావానికి ప్రతీక అని , ఈ క్రమంలో ఉద్యోగులు తమ దైనందిన విధి నిర్వహణకు దూరంగా ఉండవచ్చునని సంస్థ తెలిపింది. మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఉన్నతాధికారి కత్లీన్ హోగన్ ఉద్యోగులకు ఈ సమాచారాన్ని వ్యక్తిగత ఇ మొయిల్ సమాచారాల ద్వారా పంపించారని సంబంధిత లేఖతో ది వర్జ్ తెలిపింది. వృత్తిపరమైన ఒత్తిళ్లలో ఉండే ఉద్యోగులకు విరామం కల్పించడం ద్వారా వారు మరింత ఎక్కువగా రాణించేలా పనిచేసేందుకు వీలేర్పడుతుందని, దీని వల్ల సంస్థ నిర్ధేశిత లక్షాలు, మైలురాళ్లు సాధించుకునేందుకు వీలేర్పడుతుందని ఈ కార్యనిర్వహణాధికారి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News