- Advertisement -
మన తెలంగాణ నిడమనూరు: ప్రతి మంగళవారం, శుక్రవారం ఆరోగ్య పరీక్షలకు వచ్చే గర్బీణీలకు అంగన్వాడీ సెంటర్ నుంచి మధ్యాహ్న భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో నిడమనూరులోని గుంటిపల్లి, జంగాళవారిగూడెం, నందికొండ వారిగూడెం, నర్సింహులగూడెం, నిడమనూరు, వేలపాడు, ముకుందాపురం గ్రామాల నుంచి ఆరోగ్య పరీక్షలకు వచ్చిన గర్బీణీ స్త్రీలకు మెను ప్రకారం ఆకుకూర, పప్పు, ఉడికించిన కోడిగుడ్లు 200 ఎంఎల్ పాలు అందించటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాదవ్‌కుమార్, ఐసిడిఎస్ సూపర్‌వైజర్స్ సైదాభేగం, రాజరాజేశ్వరి, నాగమణి, అంగన్వాడీ టీచర్స్, పిహెచ్‌ఎన్ శశిరేఖ, ఆశాలు, ఆరోగ్య సిబ్బంది, ఆశావర్కర్లు, గర్బిణీలు, తల్లులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Also Read:
జలపాతంలో పడిపోయిన కారు(షాకింగ్ వీడియో)
- Advertisement -