Wednesday, January 22, 2025

ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పకడ్బందీగా అమలు చేయాలి

- Advertisement -
- Advertisement -

గోషామహల్: ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలంగా ణ పుడ్ కమీషన్ సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం కమీషన్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాల, గురు కుల పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంపై తెలంగాణ రాష్ట్ర పుడ్ కమీషన్ సభ్యులు కొంతం గోవర్ద న్ రెడ్డి, ఓరుగం టి ఆనంద్, మూలకుంట భారతి, రంగినేని శారద, కార్యదర్శి మనోహర్ తదితరులు సంబంధిత అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.

మధ్యాహ్న భోజన పథకం అమలులో నిర్లక్షం చేస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని, విద్యా శాఖ అధికారులు తరచుగా పాఠశాలలను సందర్శించి, మధ్యాహ్న భోజనం అమలు తీరు ను పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి విద్యార్థికి నాణ్యమైన, పోషకాలతో కూడిన భోజనం అందించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం వేల కోట్లు వెచ్చిస్తున్నందున సంబంధిత విద్యా శాఖ అధికారులు మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ఈ స మీక్షా సమావేశంలో నాగేందర్, శ్రీనాథ్, నర్సింగ్‌రావు, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News