Monday, December 23, 2024

మిడ్డే మిల్స్ వర్కర్స్ బిల్స్ చెల్లించాలి

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం : తెలంగాణ ప్రభుత్వం మిడ్డే మిల్స్ వర్కర్స్‌కు చెల్లించాల్సిన గత ఏడాది మెనూ బడ్జెట్‌ను ఇచ్చే వరకు అన్ని పాఠశాలలో మధ్యాహ్నన భోజనమును వంట పనులు బంద్ చేస్తామని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్ తెలిపారు. గత రెండు రోజులుగా కలెక్టరేట్ ఎదురుగా చేపడుతున్న నిరసన దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడుతూ 36 గంటల నిరసన దీక్ష గత రాత్రి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణ ఆడబిడ్డలు ప్రభుత్వానికి పెట్టిన పెట్టుబడి డబ్బులు ఇవ్వాలని అర్థరాత్రి జాగారం చేయడం కంటే ఇంకా దరిద్రం ఏమి ఉంటుందని, ఇందుకోసమేనే తెలంగాణ సంబురాలు అని ఆయన ప్రశ్నించారు. రోజుకు 33 రూపాయల వేతనం ఇచ్చి మహిళలతో వెట్టి చాకిరి చేపించుకోవడం దుర్మార్గమని తక్షణమే సీఎం కేసిఆర్ ఇచ్చిన మూడు వేల వేతనం పెంపును అమలు చేసి కేరళ మోడల్‌గా రోజుకు 600 వేతనం అందించాలని డిమాండ్ చేశారు. పిఎఫ్, ఇన్సూరెన్స్, ఐడికార్డ్, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. విజయలక్ష్మీ, మున్నా, లక్ష్మీకుమారి, ఆర్. లక్ష్మీనారాయణ్, అక్కి నరసింహారావు, దాసుల పుష్ప, మంగ, పద్మ తదితరులు పాల్గొన్నారు.

  • సమ్మె శిబిరం వద్దకు వచ్చి హామీ ఇచ్చిన డిఇఒ సోమశేఖర శర్మ

సమ్మె శిబిరంలో డిఈవో మాట్లాడుతూ వర్కర్స్‌కు వారం రోజుల్లో కలెక్టర్ చొరవ తీసుకుని అన్ని బిల్స్‌ను అందించి, ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఆయన వెంట ఎంఈవో జుంకిలాల్, శ్రీనివాస్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News