Wednesday, January 8, 2025

మిడ్జిల్ లో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మున్ననూర్ గ్రామ శివారులో ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందారు. జడ్చర్ల మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు వెంకటేశ్వర కాలనీకి చెందిన చెన్నయ్య (37), ఇంద్ర నగర్ కాలనీకి చెందిన నాగార్జున (25) మిడ్జిల్ మండలం వైపు ఉన్న ఓ గ్రామంలో తమ బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా తిరుగు ప్రయాణంలో మున్ననూర్- వాడియాల గ్రామాల మధ్య లో ఉన్న టర్నింగ్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. చెన్నయ్యను 108లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సిఐ జమ్ములప్ప మిడ్జిల్ ఎస్సై రామ్ లాల్ నాయక్ ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు మండల కేంద్రంలోని పలు సిసి కెమెరాలు పరిశీలిస్తున్నారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం జడ్చర్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Also Read: ఉత్తర భారతంలో భారీ వర్షాలు: 14 మంది మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News