హైదరాబాద్: అర్ధరాత్రి దాటిన తర్వాత యువకులు బైక్ రేసింగ్‌లతో రెచ్చిపోయారు. మలక్‌పేట, చంచల్‌గూడ తదితర ప్రాంతాల్లో యువత అర్ధరాత్రి దాటితే చాలు బైక్‌లపై ప్రమాదకరమైన స్టంట్లు చేస్తు స్థానికులను, వాహనదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. మలక్‌పేట, చంచల్‌గూడ ప్రాంతాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు అతివేగంగా బైక్‌లను నడపడమే కాకుండా రోడ్లపై స్టట్లు చేస్తున్నారు. బైక్‌లను 100 నుంచి 150 కిలో మీటర్ల వేగంతో దూసుకువెళ్తున్నారు.
స్టంట్లను చేసి వాటిని సోషల్ మీడియాలో పెడుతున్నారు, చాలా మంది యువకులు సోషల్ మీడియాలో ఫేమస్ కావాలనే ఉద్దేశ్యంతో స్టంట్లు చేస్తున్నట్లు తెలిసింది. రేసింగ్‌ల వల్ల వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. యువకులు రోజు రోడ్లపై ఇలాంటి విన్యాసాలుచేస్తున్నా పోలీసులు చలాన్లు వేసి వదిలేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారిపై కేసు నమోదు చేయకుండా నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు.