- Advertisement -
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లో శనివారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. అతివేగంతో అదుపుతప్పిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. డివైడర్ ను ఢీకొనడంతో కారు టైరు ఊడిపోయింది. మద్యం మత్తులో ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని, ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.
- Advertisement -