Monday, December 23, 2024

యుద్ధ నౌక విక్రాంత్ పై మిగ్ 29 కె రాత్రి ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :స్వదేశీ తయారీ వైమానిక వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ పై మొట్టమొదటిసారి మిగ్ 29 కె యుద్ధ విమానం బుధవారం రాత్రి చిమ్మచీకటిలో ల్యాండింగ్ కావడం నేవీ చరిత్రలో మైలురాయిగా భారత నేవీ అభివర్ణించింది. సాహసోపేతమైన రాత్రి ల్యాండింగ్ ట్రయల్ ఆత్మనిర్భరత (స్వయం సామర్ధం) కు ప్రేరణ గా భారత నేవీ అధికార ప్రతినిధి కమాండర్ వివేక్ మధ్వీ వెల్లడించారు. విక్రాంత్ నావికాదళం, నేవీ పైలట్ల నైపుణ్యానికి, వృత్తి పట్ల అంకిత భావానికి ఇది ప్రతీకగా నిరూపిస్తుందని పేర్కొన్నారు. విజయవంతంగా రాత్రి ల్యాండింగ్ చేసినందుకు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ భారత నేవీ బృందాన్ని అభినందించారు. విక్రాంత్ నౌకాదళం, నేవీ పైలట్ల పట్టుదల, వృత్తి నైపుణ్యానికి ఇది తార్కాణమని ప్రశంసించారు.

గత ఫిబ్రవరిలో రష్యాకు చెందిన మిగ్ 29కె ను , ప్రోటోటైప్‌లో స్వదేశీ నిర్మిత తేలికపాటి యుద్ధ విమానం తేజస్ జెట్స్‌ను పగటి పూట ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై ల్యాండింగ్ చేశారు.  గత ఏడాది సెప్టెంబర్‌లో దేశంలో మొదటిసారి స్వయంగా నిర్మితమైన వైమానిక వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను ప్రధాని మోడీ ప్రారంభించారు. 40 వేల టన్నులకు మించిన కేటగిరిలో నౌకలను తయారు చేసే ఉన్నతస్థాయి దేశాల సరసన ఐఎన్‌ఎస్ విక్రాంత్ చేరింది. ఇండోపసిఫిక్ రీజియన్‌లో శాంతి, సుస్థిరత నెలకొల్పడంలో ఈ ఐఎన్‌ఎస్ విక్రాంత్ కీలక పాత్ర వహిస్తుందని నేవీ వెల్లడించింది. రూ. 23,000 కోట్లతో నిర్మాణమైన ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో అత్యంత అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థ ఏర్పాటైంది. నౌకల క్షిపణులను ఛేదించే సామర్ధం ఉంది. 30 యుద్ధ విమానాలు, హెలికాపర్లు ఒకేసారి ఐఎన్‌ఎస్ విక్రాంత్‌పై స్థావరం ఉండడానికి వీలుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News