Monday, January 20, 2025

గల్ప్‌లో వలసజీవి మృతి

- Advertisement -
- Advertisement -

రాయికల్: ఉపాధిని వెతుక్కుంటూ గల్ఫ్‌కు వెళ్లిన వలసజీవి గుండెపోటుతో మృతి చెందిన విషాద సంఘటన ఇది. రాయికల్ మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన కోల రాజం(55) అనే వ్యక్తి గురువారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దాంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు.

గత కొన్ని సంవత్సరాల క్రితం అప్పు చేసి గల్ఫ్‌బాట పట్టిన రాజం అక్కడే ఓ కంపెనీలో పనికి కుదిరాడు. త్వరలోనే ఇంటికి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న రాజం తన గదిలో నిద్రిస్తూ తెల్లారి లేచేసరికి విగతజీవిగా పడి ఉండగా అక్కడి స్నేహితులు ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు రాజం గుండెపోటుతో మృతి చెందారని తేల్చినట్లు స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.

రాజం మృతితో ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయినట్లయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసారు. ప్రభుత్వం రాజం కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. రాజంకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారని గ్రామస్తులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News