Monday, January 20, 2025

అనుమానాస్పద స్థితిలో వలస కూలీ మృతి

- Advertisement -
- Advertisement -

చేగుంట: అనుమానాస్పద స్థితిలో వలస కూలీ మృతి చెందిన సంఘటన చేగుంట మండలం వడియారం గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రకాశ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం… వడియారంలోని వైకుంఠ దామం వెనకాల వ్యవసాయ పొలంలో గుర్తు తెలియని శవం ఉన్నట్టు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు కేసు నమొదు చేసుకుని శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఎరియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ ఐ తెలిపారు.

చనిపోయిన వ్యక్తి వడి యారంలోని స త్యనారాయణ వ్యవసాయ పొలంలో పడి ఉన్నాడన్నారు. మృతునికి సుమారు 40 లేదా 45 సంవత్సరాలు ఉంటాయన్నారు. సుమారు 5.5 పీట్ల పొడవు న లుపు రంగు జీన్ ఫ్యాంట్, బూడిద రంగు పువ్వులతో షర్టు, వేసుకున్నాడన్నారు. వడియారం గ్రామ పంచాయితీ కార్యదర్శి విజయ్‌పాల్ ఫిర్యాదు మేరకు కేసు నమొదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అతని అచూకి తె లిసిన వారు రామాయంపేట సీఐ 8712657933, ఎస్‌ఐ చేగుంట 8712657936, లేదా చేగుంట పోలీస్‌స్టేషన్ నంబర్ 8712657893 లకు పోన్ చే యాలని చేగుంట ఎస్ ఐ ప్రకాష్‌గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News