Thursday, January 23, 2025

విద్యుత్ షాక్‌తో వలస కార్మికుడు మృతి

- Advertisement -
- Advertisement -

సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని పూసాల ఎస్సారెస్పీ కెనాల్ సమీపాన గల కామ దీనువ్ రైస్ మిల్లులో విద్యుత్ షాక్ తో వలస కార్మికుడు మృతి బుధవారం చెందాడు. వివరాల్లోకి వెళితే పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోలుకత్తా చెందిన టయాఫ్ ఆలీ (21) అనే కార్మికుడు రైస్ మిల్లులో అస్తవ్యస్తంగా ఉన్న విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు మృతునీ యజమాన్యం హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు కోలుకత్తా రాష్ట్రం నుండి బతుకుతెరువు నిమిత్తం పొట్ట చేత పట్టుకొని వస్తే కనీసం సౌకర్యాలు కల్పించకుండా వ్యవహరిస్తున్న రైస్ మిల్ యజమాన్యం రైస్ మిల్ లో కార్మికుడిగా పనిచేస్తున్న అలీ ప్రాణాలకు యాజమాన్యం ఎనిమిది లక్షల రూపాయలు వెలకట్టి చేతులు దులుపుకున్నారు కార్మిక సంఘాలు యాజమాన్యంతో జరిపిన చర్చలలో ఎనిమిది లక్షలు అందిస్తామని యజమాన్యం తెలిపినట్లు కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News