Tuesday, January 21, 2025

కాంగ్రెస్ పాలనలోనే రైతుల వలసలు

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగానికి సక్రమంగా కరెంటు సరఫరా చేయకపోవడంతో బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు రైతులు వలసలు వెళ్లేవారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం కట్టంగూర్ మ ండల కేంద్రంలోని రైతువేదిక నందు బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అథితిగా పాల్గొని మాట్లాడారు.

కాంగ్రెస్ పాలనలో మరియు చంద్రబాబు పాలనలో నాగార్జునసాగర్ డ్యామ్ నిండలేదని, వ్యవసాయానికి నీళ్లులేక, త్రాగునీరు లేక రైతులు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేయడంతో పాటు, రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలను అమలు చేస్తూ వ్యవసాయం దండుగ కాదు పండుగలా చేసినందున రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే చిరుమర్తి పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలు 3 పంటలకు సిద్దమవుతుంటే, ప్రభుత్వం పట్ల రైతులకు ఆదరణ పెరుగుతుంటే అది చూసి ఓర్వలేక టిపిసిసి అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు నాణ్యమైన 24 గంటల క రెంటు అవసరం లేదని 3 గంటల కరెంటు చాలని అనడంతో రైతులు మరియు ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ది ఏమిటో బయటపడిందన్నారు.రైతాంగానికి 3 గంటల విద్యుత్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ది చెప్తారని తెలిపారు. 24 గంటల పాటు ఉచిత విద్యుత్ సరఫరా చేసే బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ప్రజలు మూడవసారి పట్టం కట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఊట్కూరి ఏడుకొండలు, ఎంపిపి జెల్లా ముత్తి లింగయ్య, జడ్పీటిసి తరాల బలరాములు, నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల ప్రదీప్‌రెడ్డి, వైస్ ఛైర్మన్ పోగుల నర్సింహ్మ, పిఏసిఎస్ ఛైర్మన్ నూక సైదులు, వైస్ ఛైర్మన్ కుందారపు వెంకట్‌రెడ్డి, బిఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి వడ్డె సైదిరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షులు గుర్రం సైదులు, ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు పాలడుగు హరిక్రిష్ణ, ఎడ్ల పురుషోత్తంరెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ గుండగోని రాములు గౌడ్, బిఆర్‌ఎస్ రైతు విభాగం మండల అధ్యక్షులు చిట్యాల రాజిరెడ్డి, బిబిఆర్‌ఎస్ శ్రేణులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News