Monday, January 13, 2025

బిఆర్‌ఎస్ హయాంలో ప్రజస్వామ్యం ఖూనీ అయ్యింది:మంత్రి జూపల్లి

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ హయాంలో ప్రజస్వామ్యం ఖూనీ అయ్యిందని, నిరంకుశంగా వ్యవహారించిందని, బిఆర్‌ఎస్‌ది కుటుంబ, అవినీతి పాలన అని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రజలు స్వేచ్చను హరించారని, పత్రిపక్షంతో పాటు స్వపక్ష గొంతునొక్కారని ఆయన అన్నారు. బిఆర్‌ఎస్ నేతల అరెస్ట్ విషయంపై స్పందిస్తూ ప్రజాస్వామ్యంలో చట్టానికి ఎవరు అతీతులు కారని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు మందలించాలి గానీ, కెసిర్ ఫాం హౌస్‌కు పరిమితమై తన కొడుకు, అల్లుడిని పట్టించుకోవడం లేదన్నారు. గత బిఆర్‌ఎస్ పాలకుల మాదిరి నిరంకుశంగా వ్యవహారించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ధర్నాలు చేసుకునే స్వేచ్చను ఇచ్చామని, దానిని దుర్వినియోగం చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, తమ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు బిఆర్‌ఎస్ నేతలకు లేదని ఆయన అన్నారు.

బిఆర్‌ఎస్ పార్టీ పని అయిపోందని, వారు ఎంత గీపెట్టిన ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదని ఆయన వెల్లడించారు. గాంధీభవన్‌లో గురువారం జరిగిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున కార్యక్రమానికి హాజరై మంత్రి జూపల్లికి పలు సమస్యలపై దరఖాస్తులు అందజేశారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఫించన్లు, రెవెన్యూ, తదితర సమస్యలపై ప్రజలు ఈ దరఖాస్తులను అందజేశారు. దరఖాస్తులకు స్వీకరించినప్పుడు మంత్రి జూపల్లి వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో పాటు ఇతర సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వాటిని పరిష్కరించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 103 దరఖాస్తులను మంత్రి ప్రజల నుంచి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ టిపిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించాక ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు వారంలో ఒక రోజు మంత్రులు గాంధీ భవన్‌లో ఉండేట్లు ప్రజలతో మంత్రుల ముఖాముఖి కార్యక్రమం ద్వారా సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారన్నారు. గాంధీభవన్‌లో కూడా పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజల సమస్యలు వింటున్నామని ఆయన వివరించారు. సిఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా ప్రభుత్వం, ప్రజల అకాంక్షల మేరకు నడుచుకుంటుందని ఆయన తెలిపారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని తాము సద్వినియోగం చేసుకుంటున్నా మన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని పోతున్నారన్నారు. తమ ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహారిస్తోందన్నారు. మహత్మా జ్యోతిబాపూలే భవన్‌తో పాటు జిల్లాల్లో ప్రజా వాణి ద్వారా ప్రజల వినతిపత్రాలను స్వీకరించి వారి సమస్యలను పరిష్కరిస్తున్నామని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News