- Advertisement -
ఛండీగఢ్ : జైలులో ఉన్న ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌సింగ్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. పంజాబ్ లోని ఖదూర్ సాహిబ్ పార్లమెంట్ స్థానం నుంచి అమృత్‌పాల్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు కేంద్ర ఎన్నికల సంఘం మైక్ గుర్తును కేటాయించింది.
వారిస్ పంజా దే సంస్థకు అమృత్‌పాల్ చీఫ్. జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టయి, ప్రస్తుతం అసోం లోని దిబ్రూగడ్ జైలులో ఉన్నారు. అదే విధంగా ఫరీద్‌కోట్ రిజర్వు స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సరబ్‌జిత్ సింగ్ ఖాస్తాకు చెరుకురైతు గుర్తును ఈసీ కేటాయించింది. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన నిందితుల్లో ఒకరైన బియాంత్ సింగ్ కుమారుడే సరబ్‌జిత్ సింగ్. పంజాబ్‌లోని 13 స్థానాలకు చివరి ఏడోవిడతలో జూన్ 1న పోలింగ్ జరగనుంది.
- Advertisement -