Wednesday, January 22, 2025

హైదరాబాద్‌లో నేడు ఘనంగా ‘మిలాద్‌ ఉన్‌ నబీ’ వేడుకలు

- Advertisement -
- Advertisement -

Eid-E-Milad-Un-Nabi

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో ఇస్లాం ప్రవక్త ముహమ్మద్(స) జయంతి వేడుకలను(ఈద్‌ఎమిలాద్‌ఉన్‌నబీ) ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ముస్లిం ధార్మిక సంస్థలు అనేక చోట్ల అన్నదాన కార్యక్రమాలను, రక్తదానం డ్రైవ్‌లను, ప్రవక్త సీరత్(జీవితచరిత్ర) గురించిన ప్రసంగాలు వంటివి నిర్వహించాయి. నగరంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ‘జల్సాఇరహ్మతుల్ లిల్ ఆలమిన్’ నిర్వహించారు. మహనీయులైన ప్రవక్త దాతృత్వం, ఔదార్యం, నీతులు వంటివి బోధించారు. అవి తరతరాలుగా ఆచరిస్తూ వస్తున్నారు ముస్లింలు. ప్రవక్త జయంతి ముస్లింలకు ఓ విశేషమైన పండుగ అనే చెప్పాలి. ప్రవక్త బోధనలు వారి సముదాయానికంతా సన్మార్గం చూపించేవే. ప్రవక్త పుట్టినరోజును నబీ దినం, మవ్లీద్, ముహమ్మద్ జయంతి, ప్రవక్త జయంతి అంటూ చేసుకుంటుంటారు.

ముస్లింలలోని సున్నీ తెగకు చెందిన వారైనా, షియా తెగకు చెందిన వారైనా ఎలాంటి భేదభావం లేకుండా అంతా దీనిని ఘనంగా జరుపుకుంటారు. సున్నీ ముస్లిం సముదాయం ఇస్లామీయ క్యాలండర్ మాసం రబీఉల్‌అవ్వల్ 12వ రోజున దీనిని జరుపుకుంటారు. కాగా షియా తెగవారు రబీఉల్‌అవ్వల్ 17వ రోజున జరుపుకుంటారు. వివిధ జనులకు ఈ రోజు విశేషమైనది. కాగా ఇస్లామీయ ఆచారం కాని బైక్ ర్యాలీలు వంటివి కొందరు నిర్వహిస్తుండడం ఉలేమాలను కలవరపరుస్తోంది. ఈ మధ్య కాలంలో ఇస్లామీయేతర ఆచారలను కూడా అనుసరించడం పరిపాటిగా మారింది. దీంతో ముస్లిం సముదాయంపట్ల దురభిప్రాయం కూడా ఏర్పడే అవకాశం చోటుచేసుకుంటోంది. అవి ఇస్లామీయ మూల ఆచారలకే విరుద్ధంగా ఉంటున్నాయి. డెజెలు, లౌడ్‌స్పీకర్లు వంటి వాటిని కూడా కొందరు సీనియర్ మత నాయకులు వ్యతిరేకిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్‌లో ఈసారి మిలాద్‌ఉన్‌నబీ వేడుకలు సంతోషంగా, సామరస్యంగా జరుపుకున్నారు.

Milad-Un-Nabi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News