Saturday, March 15, 2025

కర్నాటకలోని రాయచూర్ జిల్లాలో స్వల్ప భూకంపం

- Advertisement -
- Advertisement -

రాయచూర్: కర్నాటకలోని రాయచూర్ జిల్లా ఇంగసుగూర్ తాలూకాలో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 2.7 గా నమోదైనట్లు మంగళవారం అధికారులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున స్పల్పంగా భూప్రకంపనలు సంభవించినట్లు కర్నాటక రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల పర్యవేక్షణ కేంద్రంలోని వర్గాలు తెలిపాయి.

స్వల్ప భూప్రకంపనలు కావడంతో ఎటువంటి నష్టం వాటిల్లలేదని వారు చెప్పారు. ఒకటి, రెండు సెకండ్లు మాత్రమే భూమి కంపించిందని, హట్టి గ్రామ పంచాయతీకి నైరుతి దిశలో భూకంపం కేంద్రీకృతమైందని ఒక అధికారి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News